Weight loss – బరువు తగ్గడం
Weight loss – బరువు తగ్గడం ప్రస్తుతం ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు వల్ల ఇబ్బంది పడుతుంటారు. వెయిట్ లాస్ కావాలని చాలా ట్రై చేస్తుంటారు. అధిక బరువు ఉండడం వలన ఏ డ్రెస్ వేసుకున్న సరిగా సెట్ అవ్వకపోవడం ఇలా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. బరువు తగ్గడం కోసం చాలా కఠినమైన డైట్ మెయింటైన్ చేస్తుంటారు. బరువు తగ్గాలంటే పోషకలతో కూడిన డైట్ మెయింటైన్ చేయడం అవసరం. వెయిట్ లాస్ కావడం అనేది మనం రెగ్యులర్ గా తీసుకునే తిండి పై ఆధారపడి ఉంటుంది. ఆహారంతో పాటు చేసే వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్ ఏ సమయంలో తింటున్నది ఎంత నిద్రపోతున్నది ఇది చాలా ముఖ్యం సలహాల ప్రకారం బరువు తక్కువ రోజుల్లోనే అధిక బరువు తగ్గే ప్లాన్ కొన్ని ఉన్నాయి. కేవలం 40 రోజుల్లోనే 7 కేజీలు తగ్గించవచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం…
Weight loss – బరువు తగ్గడం
<strong>Weight loss</strong>

ఆహారం తీసుకునే విధానం
<strong>Weight loss</strong>
రోజు తీసుకునే ఆహారం లైట్ ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఒకే సమయానికి తినేలా అలవాటు చేసుకోవాలి. ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోకూడదు. రోజుకు ఒక్కసారి లేదా రెండు సార్లు తీసుకోవడం చాలు తర్వాత సమయాలలో కడుపును ఖాళీగా ఉంచడం ముఖ్యం. కనీసం ఒక్క రోజుకి 10,000 అడుగులు నడవాలి. కచ్చితంగా ఎనిమిది గంటల నిద్ర పోవాలి. ప్రతిరోజు కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఎక్కువగా వెయిట్ లాస్ కావాలనుకునేవారు నడక వల్ల సాధ్యమవుతుంది. వెయిట్ లాస్ కావాలనుకున్నప్పుడు స్ట్రీక్ డైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కంటికి సరిపడా నిద్ర శరీరం కావాల్సిన వాటర్ తీసుకుంటే చాలు అలాగే ఒకే చోట కూర్చోకుండా గంటకు ఒక్కసారైనా లేచి 1km లేదా 500 మీటర్స్ అన్న నడవాలి.

అతిగా తినడం..
చలికాలంలో వాతావరణం చల్లగా ఉండడం వలన కొంచెం వేడిగా ఆహారం దొరికితే చాలు బాగా తింటారు.ఇలా తినడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి కచ్చితంగా సీజన్లో కూరగాయలతో పాటు తీసుకునే ఆహారం లైట్ గా ఉండేటట్లుగా చూసుకోవాలి. కొంచెం తింటూ మళ్ళీ ఆకలి వేసినప్పుడు నీళ్లు ఎక్కువ తాగే విధంగా మెయింటైన్ చేయాలి. ఏంత టేస్టీగా ఉన్నప్పటికీ ఫుడ్ని వీలైనంతవరకు అవాయిడ్ చేయడమే మంచిది.. తీసుకునే ఆహారం కూడా ఒక లిమిట్లో తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గుతారు
ప్రోటీన్లు గల ఆహారం
బరువు తగ్గాలంటే కచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ ను కూడా తీసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువ ఉండడం వలన కడుపు తొందరగా ఆకలి వేయకుండా సమయం తీసుకుంటుంది. దీని వలన కడుపు ఖాళీగా ఉండి జీర్ణ క్రియ వేగవంతమవుతుంది. చికెన్ ,పప్పు , ప్రోటీన్ ఫుడ్ రెగ్యులర్గా తినడం మంచిది. కడుపు ఎప్పుడు నిండుగా ఉండకుండా సగం వుండేలా చూసుకోవాలి.
హైడ్రేడ్ గా ఉండడం..
చాలామంది చాలావరకు చలికాలంలో నీళ్లను చాలా తక్కువగా తాగుతుంటారు. ఇది తప్పు. కానీ ఈ సీజన్లో జీర్ణ క్రియ బాగా పెరగాలంటే మీరు ఎక్కువ నీరు తీసుకోవాలి. నీరు ఎక్కువ తీసుకోవడం వలన బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆకలి కూడా కంట్రోల్ లో ఉంటుంది. కొవ్వు కరగడానికి అవకాశాలు ఉన్నాయి.

పూర్తి నిద్ర…
బరువు తగ్గాలంటే కావాల్సిన అంత నిద్ర ఉండాలి
కనీసం ప్రతిరోజు 7 నుంచి 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి. ఇలా నిద్రపోయినప్పుడే ఆకలి వేయకుండా ఉండడం జీర్ణ క్రియ సంబంధించినటువంటి హార్మోన్స్ నియంత్రణలో ఉంటాయి. ఇలా నియంత్రణ వలన బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చలికాలం లో వ్యాయామం ..
ఈ చలికాలంలో ఎక్కువగా బద్ధకం వస్తుంది కానీ ఈ చలికాలం ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది ప్రతిరోజు ఉదయం కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయడం ముఖ్యం వీలైతే యోగా అలాగే ఇండోర్ గేమ్స్ ఎక్కువగా ఆడాల్సి ఉంటుంది ఇలా ప్రతిరోజు చేసినట్లయితే బరువు తగ్గడానికి అవకాశాలున్నాయి
డ్రింక్స్ ..
అలాగే కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు కూల్ డ్రింక్స్ బదులుగా గోరువెచ్చని లెమన్ వాటర్ గానీ హెర్బల్ గ్రీన్ టీ కానీ ఇలాంటి పానీయాలు అలవాటు చేసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది. బాగా పనిచేసి జీర్ణం క్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యంగానే అధిక బరువు తగ్గడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.

సీజనల్ ఆహారం..
తీసుకునే ఆహారంలో సీజనల్ కూరగాయలను తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సీజన్లో వచ్చినటువంటి బచ్చలకూర క్యారెట్ క్యాబేజీ ఉంటే కూరగాయలు దానిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ కంటెంట్ వల్ల తొందరగా ఆకలి వేయకుండా ఉండడం వలన బరువు తగ్గడానికి చాలా సాయపడతాయి ఈ సీజన్లో వచ్చే ఈ ఆకుకూరలు శరీరానికి రోగనిరోధ శక్తిని కూడా బాగా పెంచుతాయి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
FAQ
<strong>Weight loss</strong>
Weight loss in 40 days meal plan
40 day weight loss transformation
Weight loss in 40 days exercise
How much weight can I lose in 40 days
10 kg weight loss in 7 days diet plan
Realistic weight loss in 45 days