Vajradanti – వజ్రదంతి చెట్టు
Vajradanti – వజ్రదంతి చెట్టు మనం నడుస్తున్నటువంటి బాట వెంబడి వెంచర్లలో పొలాల వెంబడి ఉన్నటువంటి ఈ మొక్క గురించి తెలుసుకుందాం… ఈ మొక్క ఆయుర్వేదంలో అతి ఉపయోగకరమైన మొక్క. ఈ మొక్క ముల్లుతో కలిగి ఉంటుంది. ఎర్ర పూలు, పచ్చ పూలు, తెల్ల పూలు కలిగి ఉంటుంది. దీనిని ”ముళ్ళ గోరింటా” అంటారు. అలాగే దీనిని కొన్ని చోట్ల ”తేనె పూల చెట్టు” అని కూడా పిలుస్తారు. ఈ మొక్కని సంస్కృతం లో ”వజ్రదంతి”(Barleria prionitis) అంటారు. ఈ మొక్క మన దంతాలకు చాల మంచిది. ఈ మొక్క యొక్క వేరుతో పళ్ళు తోమినటైతే దంతాలు వజ్రం ల మారతాయి. అందుకనే దీనిని వజ్రదంతి అంటారు. దీని పువ్వులు కార్తీక మాసంలో చేసే శివ పూజకి ఎంతో ప్రీతికరమైనవి ఈ పువ్వులను దేవుడు చాలా ఇష్టపడతాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకని ఈ కార్తీకమాసంలో ఈ ఒక్క ముళ్ళ గోరింటా యొక్క పువ్వులను దేవుడికి సమర్పించి పూజ చేస్తారు. ఈ యొక్క మొక్క మన ఇంటి ఆవరణలో గానీ మన ఇంటి పెరట్లో గాని ఉన్నట్టయితే వాస్తు దోషాలు తొలగిస్తుందనీ నమ్మకం. ఈ మొక్క యొక్క పూల కింది భాగంలో గుచ్చులు గుచ్చులుగా ముళ్ళు ఉండి రక్షణ విధంగా పూలను కాపాడే విధంగా ఈ మొక్క కనిపిస్తుంది. చూడ్డానికి ముళ్ళ చెట్లల్ల ఉండే ఈ మొక్క ఆయుర్వేదంలో ఎంతో ప్రాచీనమైనటువంటి మొక్క.. దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎలా వాడాలి ఏమేం పని చేస్తుంది? ఏ విధంగా ఉపయోగపడుతుంది.. అనేదాని గురించి మనం వివరంగా చూద్దాం ..
Vajradanti – వజ్రదంతి చెట్టు
<strong>Vajradanti</strong>
పూర్వం ఆడవారు ఈ యొక్క పువ్వులని తలలో పెట్టుకునే వారు.. చిన్నపిల్లలు ఈ పూలతో ఆడుకుంటుంటారు. ఈ మొక్క యొక్క ఈ పువ్వులని తీసి నోట్లో పెట్టుకున్నట్లైతే చాలా మకరందం ఉంటుంది. అందుకని ఈ పువ్వులనే తేనెటీగలు కూడా చాలా ఇష్టపడతాయి. అందుకే ఈ మొక్కకి తేనె పూల మొక్కని అంటారు.
పురాణాలు ఈ యొక్క పువ్వులని బంగారు మరియు సువర్ణ వర్ణ పుష్పంగా వర్ణిస్తున్నాయి. ఈ పూలతో శివపార్వతులకు మరియు మహావిష్ణువుకి పూజ చేసినట్లయితే వారు అనుకున్న కోరికలు నెరవేరుస్తాయని ప్రతిదీ. అందుకనే ఈ పూలని కార్తీకమాసంలో చాలా వరకు తీసుకొచ్చి దేవుడు సన్నిధిలో పూజలు నిర్వహిస్తుంటారు. ఈ పువ్వులకి మన హిందుత్వంలో ఎంతో ప్రాచీనత ఉంది….
Uses – ఉపయోగాలు..
<strong>Vajradanti</strong>
- ఈ యొక్క చెట్టు ఆకులని నీటిలో వేసి మరిగించి బాగా మరిగిన తర్వాత ఆ యొక్క రసాన్ని నోటిలో పుక్కిలించి ఉంచినట్లయితే నోట్లో నుంచి వచ్చే దుర్వాసన మరియు నోటి చిగుళ్ల నుంచి కారే రక్తం తగ్గిపోతుంది.
- ఈ యొక్క చెట్టు వేరుని తవ్వి మంచిగా కడిగి ఆ వేరుతో మన పళ్ళు తోవినట్లయితే పచ్చగా ఉన్నటువంటి పళ్ళు కూడా తెల్లగా మారుతాయి. అలాగే పళ్ళు దృఢంగా మారుతాయి. ఇదే కాకుండా ఉత్తరేణి చెట్టు యొక్క వేరుతో కూడా పళ్ళు తోమినట్టయితే మన పళ్ళు దృఢంగా మారుతాయి.
- ఈ యొక్క చెట్టు వేరుని తీసుకొని ఆ వేరుని నీటిలో మరిగించి బాగా మరిగిన తర్వాత దానిని నోటిలో పుక్కిలించి ఉంచినట్లయితే పిప్పిపండ్ల నొప్పి ఉన్నవారు పన్ను నొప్పి ఉన్నవారు ఈ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- ఈ యొక్క చెట్టు ఆకులని దంచి వాటిని గజ్జి, తామర, దురద, కురుపులు ఉన్నచోట చర్మ సమస్యలు ఎక్కడున్నా అక్కడ రుద్దినట్లయితే ఆ సమస్య తగ్గిపోతుంది. అలాగే మళ్లీ రాకుండా నివారిస్తుంది.
- కీళ్ల నొప్పులు వాపులు, మోకాళ్ళ నొప్పులు, ఉన్నవారు ఈ యొక్క ఆకులని దంచి నొప్పులనుచోట కట్టినట్టయితే వాపు నొప్పుల నుంచి తగ్గుముఖం పడతాయి. అలాగే ఈ యొక్క ఆకులను వేడి చేసి నొప్పులు ఉన్నచోట కట్టిన వాపులు నొప్పులు తగ్గిపోతాయి. దంచి కట్టడం కంటే ఆకులను వేడి చేసి కట్టడం వల్ల తొందరగా నొప్పులు తగ్గే అవకాశాలున్నాయి.
- బాగా తలనొప్పి ఉన్నవారు దీర్ఘకాలికంగా తలనొప్పి వచ్చేవారు ఈ యొక్క ఆకులని కొంచెం గా వేడి చేసి తలపై పెట్టుకుని కట్టు కట్టుకున్నట్లయితే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. మళ్లీ రాకుండా నిర్మూలిస్తుంది..
- ఈ యొక్క ఆకులని బాగా కడిగి వాటిని మెత్తగా దంచుకొని అందులో కొంచెం ఉప్పు కలుపుకొని రోజూ పళ్ళు తోమినట్టయితే పళ్ళు ధృడంగా మారుతాయి. అలాగే పచ్చగా ఉన్న పనులు కూడా తెల్లగా మారిపోతాయి. ఇదే విధంగా ఉత్తరేణి ఈ వేరుతో కూడా పళ్ళు తోమినట్టయితే దృఢంగా మారుతాయి.
- చాలామందికి కాళ్లు పగుళ్లు ఉంటాయి. అవి ఎన్నో రోజుల నుంచి ఎలాంటి ఆయింట్మెంట్స్ వాడిన తగ్గకుండా ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వాటికి కూడా ఈ యొక్క ఆకులను తీసుకొని పేస్టులా చేసి వాటి ని కాళ్లు పగిలిన చోట రోజు పెడుతున్నట్టయితే కాళ్ల పగుళ్లు మానిపోయి, పాదాలు అందంగా దృఢంగా తయారవుతాయి మళ్లీ ఈ పగులు రాకుండా అరికట్టుతుంది.
- శరీరంలో కొవ్వు ఉన్నవారు అలాగే కిల్లా వాపు ఉన్నవారు ఈ మొక్క యొక్క కట్ట యొక్క చర్మాని వలచి ఆ చర్మాన్ని ఐదు నుండి పది రోజులు నీడలో ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టిన చర్మాన్ని చూర్ణంలా చేసుకుని రోజు ఉదయాన్నే నీళ్లల్లో ఒక స్పూన్ వేసుకొని మరియు సాయంత్రం నీళ్లలో స్పూన్ వేసుకొని తాగినట్లయితే వారి కీలవాపులు మరియు వారి పొట్టలో ఉన్నటువంటి కొవ్వు చుట్టుపక్కలనట్టు కొవ్వు కూడా కరిగిపోతుంది వెయిట్ తగ్గడానికి అవకాశం ఉంది.
- శరీరంలో వీర్యకణాలు తక్కువ ఉన్నవారు ఈ యొక్క ఆకులని దంచి కొంచెం తేనెలో కలుపుకుని రోజు తీసుకున్నట్లయితే వారికి వీర్యకణాలు అభివృద్ధి చెందుతాయి.
- ఈ మొక్కను ఆకులు కాండం వేరు పూర్తిగా కాల్చాలి ఇలా కాల్చిన తర్వాత వచ్చిన బూడిదను రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ వాటర్లో ఒక చెంచా కలుపుకొని తాగినట్లయితే ఉబ్భాసను తగ్గును. లేదా అదే బూడిదలో కొంచెం తీనే లో కలుపుకొని సేవించినట్లయితే కూడా ఉబ్భాసం తగ్గిస్తుంది.
- ఈ మొక్క యొక్క వేరుని తీసుకొని బాగా కడిగి దంచిన తర్వాత బియ్యం మొదటిసారి కడిగిన నీటితో కలిపి తాగినట్లయితే తేలు యొక్క విషయాన్ని హరిస్తుంది.
- ఈ యొక్క ఆకులతో చేసినటువంటి కషాయం దానిలో కొంత నువ్వుల నూనె కలిపి రోజు సేవించినట్లయితే వాతం పట్లు వాత నొప్పులు ఉన్నవారికి తొందరగా తగ్గిపోతుంది.
Advice – సలహాలు..
<strong>Vajradanti </strong>
ఈ యొక్క ఆయుర్వేద మొక్క యొక్క గుణాలను మీ అనుకూలతం ఉన్నంతవరకు మాత్రమే వాడాలి.
ఏమాత్రం ఈ మొక్క వాడుతున్నప్పుడు మీకు ఇబ్బంది కలిగించిన వెంబడే ఈ వాడటం ఆపివేయాలి. ఇట్టి జరిగినట్టయితే మీకు ఈ యొక్క మౌలిక ఔషధాలు పడటం లేదని అర్థం చేసుకోవాలి. కానీ హాని కలిగించే గుణాలు మాత్రం ఈ యొక్క మొక్కలో లేదు. నోటిలో వాడినప్పుడు కషాయాన్ని గాని నోట్లో తోముతున్న పేస్టు గాని రెండు మూడు రోజులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క మొక్క వేరుతో పళ్ళు తోమడం రోజు చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు..
మా దగ్గర ఉన్నటువంటి రోగులకి మేము దీనిని వారి అనుకూలత మేరకు ఇస్తుంటాం. ఎవరికి కూడా రియాక్షన్స్ అనేది ఇప్పటివరకు లేదు. ఈ మొక్క ప్రతి ఒక్కరికి సానుకూలంగా శరీరానికి పారుతుంది. ఎలాంటి ఇబ్బంది కలగదు.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం CLICK HERE
FAQ;
<strong>Vajradanti</strong>
Mulla gorinta plant in english
Mulla gorinta plant medicinal uses