Tulasi Plant – తూలసి ఆకూ ఉపయోగాలు
Tulasi Plant – తూలసి ఆకూ ఉపయోగాలు మన భారతీయ ఆయుర్వేదంలో ఈ తూలసి మొక్కకి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనం దీన్ని ఎంతో పవిత్రంగా భావించి ఇళ్లల్లో ఇళ్ల ముందు పెంచే ఈ తులసి మొక్కలు ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి తో ఉండే పదార్థాలు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు వ్యాధులను దూరం చేస్తాయని చెప్పవచ్చు. తులసి ఆకులను నేరుగా తిన్న లేదా ఎండబెట్టి పొడిలా చేసి టీ చేసుకుని తాగిన మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ప్రతిరోజు ఉదయం పరిగడుపున ఈ తులసి ఆకులను తిన్నట్లయితే సర్వరోగ నివారణ గా పనిచేస్తుంది. ఇంకా ఈ తులసి ఆకులలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. అవి మనం తెలుసుకుందాం…
Tulasi Plant – తూలసి ఆకూ ఉపయోగాలు
Tulasi Plant
రోగ నిరోధక శక్తి
Tulasi Plant
ఈ తులసి ఆకులను గాని, ఈ తులసి చూర్ణం గాని, రోజు పొద్దున తినిన లేదా చూర్ణం చేసుకొని తాగిన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్, మన శరీరానికి అందుతాయి. అవి మన శరీరానికి అందడం వల్ల రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. మన శరీరంలో వచ్చేటువంటి బ్యాక్టీరియా వైరస్లను ఎదుర్కునే శక్తి వస్తుంది.
కాలేయంలో
Tulasi Plant
ఈ తులసి ఆకులను రోజు పొద్దున్న నమిలి తిన్నట్లయితే లేదా టీ చేసుకుని తాగినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను బయటకి పంపిస్తాయి. అదేవిధంగా కాలేయాన్ని శుభ్రం చేస్తాయి. రోజు ఉదయం ఈ తులసి ఆకులను తిన్న లేదా టీ చేసుకునీ తాగినా మన కాలేయం పనితీరు చాలా మెరుగుపడుతుంది. మలబద్ధక సమస్యను నివారించి మలం బయటకు పోయే విధంగా చేస్తాయి.
ఒత్తిడి తగ్గించడంలో
Tulasi Plant
ఈ తులసి ఆకుల నుంచి వచ్చే వాసన మానసిక ప్రశాంతతను కల్పిస్తాయి. అందుకనే ప్రతి గుళ్లోనూ ప్రతి ఇంటి ముందు ఈ తులసి ఆకులను ఉంచుతారు. ఇవి నేరుగా గాలిని ఫిల్టర్ చేసి అందిస్తాయి. ఆక్సిజన్ ఇవ్వడంలో ఈ తులసి ఆకులను మించిన చెట్లు లేవని చెప్పవచ్చు. అందుకనే మనలో ఉన్న హార్మోన్స్ ఈ యొక్క వాసన పీల్చినప్పుడు శరీరం చాలా అనుకూలతగా మారిపోతుంది. దీనివలన మనసు ప్రశాంతత కలుగుతుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ చెట్టు ఉన్నచోట మానసిక ఒత్తిడికి తావు ఉండదు. పూర్వకాలం నుంచి పూర్వీకులు కూడా ఈ చెట్టును ఇంటి ముందు కానీ ఇంట్లో గానీ ఉంచేవారు ఈ చెట్టు యొక్క గాలి సోకడం వల్ల మానసిక ప్రశాంతత కొత్త ఆలోచనలతోపాటు ఆరోగ్యం కూడా మెరుగుపడేది. అందుకనే దీనిని సర్వరోగ నివారిణిగా చాలా పవిత్రంగా మన హిందుత్వంలో భావిస్తారు
జీర్ణవ్యవస్థలో పనితీరు
Tulasi Plant
ఈ తులసి ఆకులను రోజు తినడం వలన జీర్ణ వ్యవస్థ పనితీరు చాలా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు శ్వాస వ్యవస్థ సమస్యలను దూరం చేస్తాయి. అస్తమా సైనస్, జలుబు, దగ్గు ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఏర్పడినప్పుడు అవి నేరుగా బయటకు వచ్చి చర్మ సమస్యలుగా, వివిధ రకాల సమస్యలను మనకు చూపిస్తాయి. ముందుగా ఏదైనా సమస్య మానవునికి వస్తుంది అంటే కచ్చితంగా అది జీర్ణ వ్యవస్థ నుంచి రావడం జరుగుతుంది. అందుకనే మలబద్ధక సమస్యలు నివారించడంలో జీర్ణ వ్యవస్థ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. జీర్ణా క్రియా సరిగా లేనివారికి మలబద్ధక సమస్య ఏర్పడుతుంది. దీని వలన సర్వరోగ వస్తాయని చెప్పి ఆయుర్వేదం చెబుతోంది. దీని ప్రకారం జీర్ణక్రియ ఎవరికైతే సరిగ్గా పని చేస్తుందో వారికి రోగాల పాలు కారు అలాంటి జీర్ణ క్రియను మెరుగుపరచడంలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. ఈ తులసి ఆకులను రోజు పొద్దున 4 తిన్నట్లయితే లేదా టీ చేసుకుని తాగిన జీర్ణ క్రియ వేగం పెరిగి జీర్ణవ్యవస్థ సమస్యలు తగ్గిపోతాయి
షుగర్
Tulasi Plant
ఈ తులసి ఆకులు రోజు ఉదయం తిన్న లేదా టీ చేసుకుని తాగిన రక్తంలో ఉన్న చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి. మన శరీరంలో ఉన్నటువంటి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. దీనితో చక్కెర స్థాయి నియంత్రణకు వస్తుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
గుండె ఆరోగ్యం
Tulasi Plant
ఈ ఆకులను ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడూ తిన్న షుగర్ స్లేవల్స్ తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఈ ఆకులు బాగా పనిచేస్తాయి. అనవసరమైన పదార్థాలను మలం ద్వారా బయటికి పంపించి శరీరాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతాయి. ఈ ఆకులు గుండె సమస్యలు తగ్గించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి.
భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదం ప్రకారం ఈ తులసిటి చెట్టుకి ఉన్న ప్రధాన్యత వేరే మొక్కలకు లేదు. ఈ తులసి మొక్క ఒక దేవుడి మొక్క అని చెప్పవచ్చు. ఈ మొక్కలో అణువణువు ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. ఈ చెట్టు సమూలంగా తీసుకున్న మంచి లాభాలు ఉన్నాయి. ఈ చెట్టు యొక్క గుణాలు వివరించలేనివి అని చెప్పవచ్చు. తులసి మొక్కలు నాలుగు రకాలుగా ఉన్నాయి. బూ తులసి, అని నేల తులసి అని, కృష్ణ తులసి అని, తులసి అని చెప్పి కానీ మనం ఎక్కువగా చూసేది కృష్ణ తులసి నేల తులసి చూస్తాం. బూ తులసి ఊర్లలో ఉన్న వారికి మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కువగా అడవులలో పెరుగుతుంది. దీని వాసన కూడా సుగంధంగా ఉంటాయి. ఏ తులసి ఆకులు తినిన కొంచెం కారం కొంచెం వగరుగా అనిపిస్తాయి. ఈ ఆకుల నుంచి సమాన ఫలితాలు అందుతాయి. తులసి ఆకులు మానసిక ప్రశాంతత ఇవ్వడంలో చాలా గొప్పగా పనిచేస్తాయి. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఈ ఆకులను నేరుగా తీసుకుని ముక్కుతో గాలి పిలిచినట్లయితే కొత్త ఆలోచనలతో పాటు ఉన్న సమస్యను తొలగించడంలో మనకు ఎంతో తోడ్పడుతుంది. నిజానికి చెప్పాలంటే ఈ తులసి చెట్టు దేవుడికి ప్రీతికరమైనది. అందుకనే ప్రతి గుళ్లోనూ ఈ చెట్టును పెడుతుంటారు. ఈ చెట్టు ఎక్కడున్నా అక్కడ నెగెటివిటీ తగ్గిపోయి. పాజిటివ్ పెరుగుతుందని అర్థం.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Tulasi Plant