Thota kura – తోట కూర ఉపయోగాలు
Thota kura – తోట కూర ఉపయోగాలు ఈ రోజుల్లో అయితే ఆకుకూరలను ఇష్టపడని వారు వుండరు.. వీటిని మార్కెట్లలో ఎగబడి మరీ కొంటాం.. కానీ ఇందులో ఏ ఆకుకూర మంచిది ఎక్కువ బలాన్నిస్తుందని సందేహపడుతుంటారు. ఈ విషయం లో ”తోటకూర” ”రారాజు” అని చెప్పవచ్చు. ఇందులో రోగ నిరోధక శక్తి పెంచే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్స్ ఇచ్చే గుణాలు ఉన్నాయి. రక్తం తగ్గిపోతే రక్తాన్ని పెంచే గుణాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ఉపయోగాలు ఈ ఆకుకూరలో ఉన్నాయి. అయితే ఈ ఆకుకూరని సమూలంగా వాడిన లాభాలు ఉన్నాయి. ఆకులు కాండం, వేరు, రకరకాలుగా వాడవచ్చు. అదెలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం…
Thota Kura – తోట కూర ఉపయోగాలు
<strong>Thota Kura</strong
Thota Kura – తోట కూర
సహజంగా లభించే ఈ తోటకూర లేతగా కొంచెం ముదురుగా ఉన్నటువంటిది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది.వీటిని ఆకులే కాకుండా వీటి కాండం, వేరు ఈ భాగాలతో కూడా ఆరోగ్యానికి మంచి చేసే గుణాలు ఉన్నాయి. అయితే ఈ తోటకూరని వండుకొని తిన్న లేదా నీటిలో వేసి బాగా కాచి కషాయంలో చేసుకొని తాగిన సమూలమైన ఫలితాలు ఉంటాయి. వీటి వేరుని చూర్ణం చేసుకొని కూడా తినవచ్చు. కానీ ఎక్కువగా మనం వేపుడు చేసుకోవడం తోటకూర పచ్చడి కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఈ కూరని ఉడికించకుండా తిన్న చాలా మంచి ఫలితాలు వస్తాయి.అవి ఎలాంటివి ఎలా వస్తాయి.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
Thota Kura
Uses – ఉపయోగాలు
<strong>Thota Kura</strong>
- తోటకూరను రెగ్యులర్ గా తినడం వలన గుండెకు మంచి చేసే గుణాలు ఉన్నాయి.
- తోటకూరను ఎక్కువగా తినే వారికి కాళ్ల తిమ్మిర్లు చేతుల తిమ్మిర్లు తక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే ఇందులో విటమిన్స్ అన్ని అధికంగా ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెంచడమే కాకుండా ఈ కాళ్లు గుంజడాలు తిమ్మిర్లను తగ్గించ గుణం ఇందులో అధికంగా ఉంటుంది.
- శరీరంలో ఎక్కువ నీరు శాతం చేరినప్పుడు ఈ తోటకూరని కాషాయంలా చేసుకుని లేదా కూరను వండుకొని తిన్నట్లయితే నీరు శాతం తగ్గిస్తుంది.
- తరచుగా అతిమూత్ర వ్యాధితో బాధపడుతున్న వారు ఈ తోటకూరను వేపుడు చేసుకుని గాని కషాయం గాని తాగినట్లయితే మూత్రపిండాల సంరక్షణలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ అతిమూత్ర వ్యాధిని కూడా తగ్గిస్తుంది. కానీ ఈ తోటకూరను రోజు కొంచెం ఐన తినాలి.
- మలబద్ధకం సమస్య ఉన్నవారు ఈ తోటకూర వేళ్లను ఆకులను కాండాన్ని సమూలంగా తీసుకొని 10 నుంచి 15 రోజులు నీడలో ఎండబెట్టి చర్ణంలా చేసుకుని నీటిలో వేసుకొని ఉదయం పూట పరిగడుపున తాగినట్లయితే మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందుతారు. విరోచనం సాఫీగా జరుగుతుంది.
- ఆడవారిలో రక్తస్రావం రుతుచక్ర సమయంలో ఎక్కువగా అవుతున వారు అలాంటి వారికి ఈ తోటకూర పులుసులా చేసుకుని తాగినట్టు అయితే వారికి రక్తస్రావం కాకుండా తగ్గిస్తుంది.
- తాజాగా ఉండే తోటకూర ఆకులను తీసుకొని మిక్సీలో వేసి పేస్టులా చేసుకుని వాటిని రెగ్యులర్ గా రోజు వారిగా తలకి రుద్దుకున్నట్లయితే జుట్టు రాలుట సమస్య తగ్గుతుంది. అలాగే రాలుతున్న చుండ్రులు కూడా నివారిస్తుంది. వెంట్రుకలు నల్లబడడానికి సహకరిస్తుంది.
- అధిక బరువు ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు ఈ తోటకూర వేరుతో సహా సమూలంగా తీసుకొని చూర్ణం చేసుకొని రెగ్యులర్గా నీటిలో వేసుకొని పరిగడుపున తాగినట్టయితే వారికి మలబద్ధకం సమస్య మరియు కొవ్వు కరిగిపోయి వారు సన్నబడడానికి అవకాశాలున్నాయి. కానీ ఇది రెగ్యులర్ గా చేయాల్సి ఉంటుంది.
- తోటకూరను వండుకొని తిన్న ఇందులో ఉండే పీచు పదార్థం వాళ్ళు కూర ఎక్కువగా తినడం వలన మలబద్ధకం సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తిని పెంచడం కూడా జరుగుతుంది.
- ఈ తోటకూరని సమూలంగా చూర్ణం కాని రెగ్యులర్ గా తిన్నట్లయితే లేదా వారంలో కనీసం మూడుసార్లు తిన్నట్లైనా గొంతుకు సంబంధించిన ఇన్స్పెక్షన్స్ ఏమైనా ఉన్నా లేదా సీజనల్ గా వచ్చే వ్యాధులను నివారించడంలో చాలా బాగా పనిచేస్తుంది.
- ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు అప్పుడే తగిన దెబ్బలకు అయితే ఈ తోటకూర ఆకుల్ని పేస్ట్ లా చేసి రుద్దినట్లయితే ఆ దెబ్బలు కూడా తొందరగా మానడానికి అవకాశాలు ఉన్నాయి.
- శరీరంలో ఐరన్ శాతం తక్కువ ఉన్నవారు ఈ యొక్క తోటకూరని బాగా ముదిరిన ఖండాలు ఉన్నా కూరని తీసుకొని తిన్నట్లయితే ఐరన్ శాతం పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది.
- చిన్నపిల్లలకి ఎముకలు గట్టిపడడానికి తోటకూరను రెగ్యులర్గా తినిపించినట్టయితే వాళ్ల లోపల సహజమైన మార్పులు వస్తుంటాయి. ఎముకలు గట్టి పడతాయి.
- షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు కూడా ఈ యొక్క కూరని గాని చూర్ణం గాని రెగ్యులర్ గా తీసుకుంటే అధికమైన షుగర్ తగ్గించడంలో దోహదపడుతుంది.
- అధికంగా ఆకలి వేసే వారికి కూడా ఈ యొక్క తోటకూర వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ చూర్ణం గాని ఈ కూరను గాని వేపుడుగానే తిన్నట్లయితే రెగ్యులర్ గా వారికి తక్కువ మోతాదులు ఆకలి వేయడం జరుగుతుంది.
- కళ్ల సమస్యలు ఉన్నవారు కొంతమందికి మాత్రమే ఈ తోటకూర తినడం వల్ల ఆ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. అందరికీ కళ్ళ సమస్యను తోటకూర తగ్గించదు.
- అన్ని ఆకుకూరలలో కెల్లా ఈ ఆకుకూర క్యాన్సర్ బారిన పడకుండా చాలా బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ ఉన్నవారు దీని అధికంగా తీసుకున్నట్లయితే కొంత ఉపశమనం లభిస్తుంది.
Advice – సలహాలు
<strong>Thota Kura</strong>
ఈ కూరను తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు మలబద్ధకం సమస్య అయితే తినవచ్చు. షుగర్ లెవెల్స్ అయినా తినవచ్చు. కంటి సంబంధిత వ్యాధులు ఉన్న గుండె సంబంధించిన ఉన్న క్యాన్సర్ ఉన్న ఇలాంటి మరెన్నో చెప్పలేని ఔషధాలు గుణాలు కలిగి ఉన్నటువంటి ఈ కూర ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.పూర్వమైతే పూర్వీకులు ఎక్కువగా తీసుకునేవారు ఎందుకంటే వారు తినే ఆహారం తక్కువగా తినాలని చెప్పి చాలా జాగ్రత్తగా పడేవారు కాబట్టి ఈ ఆకుల తినడం వలన వారికి ఆకలి వేయడం చాలా తక్కువగా అవుతుండేది.
తోటకూరలు రెండు రకాలుగా ఉన్నాయి. కానీ వాటిలో ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర ఉంటాయి. మనకు ఎక్కువగా ఇవే దొరుకుతాయి. ఎర్ర తోటకూర పెరుగు తోటకూరగా కూడా పిలుస్తారు. ఇవి ఏవైనాప్పటికీ సమాన ఫలితాలని ఇస్తాయి.
ఇంక ఆరోగ్య సమస్యలకు నివారణ తెలుసుకోవాలంటే ఇక్కడ CLICK HERE
FAQ
<strong>Thota Kura</strong>
amaranth benefits, side effects
Amaranth leaves juice benefits