Munagaku Benefits In Telugu – మునగ చెట్టు
Munagaku Benefits In Telugu – మునగ చెట్టు మన పరిసరాల్లో ఉన్నటువంటి ఒక మిరాకిల్ చెట్టు గురించి తెలుసుకుందాం.. మన పరిసరాల్లో మన పేరట్లో మన ఇళ్ల మధ్యలో ఉంటుంది. దీని మామూలుగా తోట కూడా పెడుతుంటారు. ఈ చెట్టు ”ములగ చెట్టు” దీని యొక్క కాయలు మనం ఎంతో ఇష్టంగా ములగకాయ కూర చేసుకుని తింటుంటాం. అలాగే ఈ ములక్కాయ కూర తిన్నట్లయితే మగవారికి ఎంతో బలం అనుకుంటూ ఉంటాం. నిజానికి నిలువెల్లా సంజీవని అంటే ఈ చెట్టు వేరు నుంచి ప్రతి ఆకు కాండం, బెరడు, పూత, కాయ దాంట్లో ఉన్న విత్తనం కూడా ఒక ఔషధ గుణం కలిగి ఉంది. ఈ ములక్కాయ చెట్టు విపరీతమైన ఔషధ గుణాలు కలిగి ఉంది. చూస్తే కేవలం ఒక కాయ మాత్రమే తీసుకొని వంట చేసుకుని తింటున్నారు…
Munagaku Benefits In Telugu – మునగ చెట్టు
<strong>Munagaku Benefits In Telugu</strong>
ఈ చెట్టులో విటమిన్స్ ఉండడం వల్ల రక్తహీనత ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్లు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు, ఎముకలు దృఢంగా మారడానికి, కళ్ళు మంచి కనిపించడానికి, బాడీలో నరాల బలహీనత ఉన్నవారు, వైరస్ మరియు బ్యాక్టీరియా ఇలాంటి రోగాలు కూడా దరిచేరనీయకుండా కాపాడడం. అస్తమా, ఉబ్బసం ఉన్నవారు కూడా దీని తో నయం చేసుకోవచ్చు. నోటి దుర్వాసన, నోట్లో అల్సర్, మొఖంపై మొటిమలు, మచ్చలు, దురద, గజ్జి, తామర, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, ముఖం అందంగా మారడానికి, చర్మ సౌందర్యానికి, నెత్తిపై వెంట్రుకలు మొలవడానికి, ఇంకా మానసిక ఒత్తిడి టెన్షన్స్ నుంచి కూడా మనిషిని ఫ్రీ చేయడానికి ఆహ్లాదకరమైన మనసు సంతోషాన్ని ఇవ్వడానికి కూడా ఈ ములక్కాయ చెట్టు ఉపయోగ పడుతుంది. మా పెద్దవారైతే ఈ ములక్కాయ చెట్లని మా బావి దగ్గర మా ఇండ్లలో పేరాడ్లలో నాటేవారు….
ఇప్పుడు కొంతమంది ఈ చెట్టు భారీగా పెరుగుతుందని కట్ చేయడం ఆకులు ఎక్కువ పడుతుందని చెప్పి ఏదో ఒక కారణం చేత ఈ చెట్లని మన ఇళ్లలో లేకుండా కట్ చేస్తుంటారు. ఇది ఇప్పటి నుంచే కాదు పూర్వకాలం నుంచి కూడా ఇది విపరీతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. అసలు ఈ చెట్టు ఇంత ఔషధ గుణాలు కలిగి ఉన్న ఎందుకు గుర్తించలేకపోతున్నారు. అసలేంటి ఇందులో ఉన్న గుణం ఇప్పుడు చూసేద్దాం ఎలా వాడాలి? ఎలా వాడితే పని చేస్తుంది? ఏ విధంగా ఆకు ఉపయోగించాలి? బెరడు ఏ విధంగా ఉపయోగించాలి? వేరుని ఏవిధంగా ఉపయోగించాలి? ఈ కాయ వల్ల కలిగే లాభాలేంటి? ఈ చెట్టు ఎక్కడ సేకరించాలని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం……
uses – ఉపయోగాలు
<strong>Munagaku Benefits In Telugu</strong>
- ఈ ములకాయ ఆకులను తీసుకొని వాటిని బాగా కడగాలి. ఆకులని నీళ్లలో వేసి బాగా మరిగించి డికాషన్ మాదిరిగా చేసుకొని తాగినట్లయితే బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
- ఈ ములకాయ ఆకులు గానీ చెక్క యొక్క బెరడు గాని తీసుకుని నీడలో 10 నుంచి 15 రోజులు ఎండబెట్టాలి. తర్వాత వాటిని చూర్ణం గా చేసుకొని రోజు ఉదయం సాయంత్రం వాటర్ లో ఒక చెంచా వేసుకొని తాగినట్లయితే వారికి షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది.
- ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్నవారు యొక్క మొలకయకులని బాగా దంచి ఆకుల రసంలో కొంచెం తేనె కలిపి ఆ యొక్క రసాన్ని మొటిమల పై భాగాన మచ్చలపై బాగానా పెట్టినట్లైతే ఆ మొటిమలు తగ్గిపోతాయి.
- ఈ యొక్క ములక్కాయ చెట్టు యొక్క నూనెని నెత్తికి వాడినట్టయితే వెంట్రుకలు బాగా పెరగడానికి, ఉన్న వెంట్రుకలు ఊడకుండా వెంట్రుకలు నల్లగా మారడానికి వెంట్రుకల బలానికి కూడా ఈ యొక్క నూనె బాగా పని చేస్తుంది.
- చర్మంపై చాలామందికి సెగగడ్డ లాగా వస్తుంటాయి. అలాంటి వాటికి ఈ యొక్క ములక్కాయ ఆకులను తీసుకుని ఉడికించి కషాయంలో చేసుకొని తాగినట్టు అయితే ఆ సెగ గడ్డలు చర్మం పైన ఉన్నటువంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి. ఇదే విధంగా కూర వండుకొని తిన్నా కూడా వీటిని నిర్మూలించవచ్చు.
- ముఖ్యంగా ఆడవారికి నెలసరి టైం లో బాగా రక్తం లాస్ అవుతుంటారు. అలాంటి వారు ఈ యొక్క ఆకుల కాషాయం తాగడం వల్ల వారికి రక్తహీనత తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు రక్తం లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు కూడా ఈ యొక్క కషాయాన్ని తాగడం వల్ల ఉదయం సాయంత్రం వారికి రక్తహీనత తగ్గుతుంది.
- పాలిచ్చే గర్భిణీలు అయితే ఈ యొక్క ఆకులని తీసుకొని కూరలా వండుకొని తిన్నట్లయితే వారికి పాలు బాగా పెరిగి బాబుకి ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది.
- దీర్ఘకాలికంగా అస్తమ ఉన్నవారైనా వంశపార్యంగా వస్తున్నటువంటి హస్తము ఉన్నవారైనా సరే ఈ యొక్క ములకాయ ఆకులని కానీ, చూర్ణంని కానీ తీసుకొని రోజు ఉదయం సాయంత్రం ఆ గ్లాస్ వాటర్ లో వేసుకుని తాగినట్లయితే వారికి ఈ యొక్క ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే మీరు కూర వండుకొని తిన్నా కూడా పనిచేస్తుంది.
- కొంత మందికి నోట్లోంచి దుర్వాసన వస్తుంది. చాలామందికి ఇలా వచ్చేవారు ఎదుటివారితో మాట్లాడలేకపోతుంటారు. అలాంటి వారు కూడా ఈ యొక్క ఆకుల కషాయాన్ని నోట్లో బుక్కిలించి ఉంచిన, కడుపులోకి తాగిన నోటి దుర్వాసన అరికడుతుంది. అలాగే నాలుకకు సంబంధించి రుచి పెరుగుతుంది.
- నోట్లోంచి రక్తం కారడం చిగుర్లు పగుళ్లు నోట్లో చిన్న చిన్న పొక్కులు అలాంటిదాన్ని కూడా ఈ యొక్క కషాయం కానీ ఈ యొక్క రసాన్ని గాని తాగిన పోకిరి చుంచిన వారికి మేలు చేస్తుంది.
- ఈ యొక్క ములకాయ చెట్టు విపరీతమైన ఔషధ గుణాలు ఉండటం కంటి చూపుకు చాలా పని చేస్తుంది. రేచీకటి సమస్య ఉన్నవారు కండ్లు మబ్బుగా కనిపించేవారు ఈ యొక్క ఆకుల జ్యూస్ ఉదయం సాయంత్రం తాగినట్లయితే ఈ కంటి చూపును పెంచుకోవచ్చు. రే చీకటి సమస్య ఉన్న తగ్గిపోతుంది. కంటి చూపులో చాలా క్రియాశీలకంగా ఈ ములక్కాయ ఆకులు చెక్క చూర్ణం బాగా పనిచేస్తుంది.
- చిన్నపిల్లల్లో పెరుగుతున్న వారు కాబట్టి వారికి ఎముకలు బలంగా ఉండడానికి ఈ ములక్కాయ యొక్క జ్యూస్ ని తాపడం మంచిది. వాళ్లు తాగాని పక్షాన ఈ ములక్కాయ కషాయంలో కొంత తేనే కలిపి కూడా తాపవచ్చు. వారికి ఎముకలు దృఢంగా మారుతాయి.
- మన శరీరంలో పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోవడం గుండె దగ్గర కూడా పెరిగి గుండెపోటు రావడం ఇలాంటి లక్షణాలు ఈ మధ్య చాలా కనిపిస్తున్నాయి. ఇలాంటి వారికి కూడా ఈ మొలకాయ జ్యూస్ ఉదయం సాయంత్రం తాగినట్లయితే లేదా కూర వండుకొని తిన్న ఈ చూర్ణంని తీసుకున్న డికాషన్ చేసుకొని తాగిన ఈ యొక్క కొలెస్ట్రాల్ ని కొవ్వుని కరిగించడంలో చాలా ఉపయోగపడుతుంది.
- ఈ ములక్కాయలు వీటి ఆకులు వీటి చూర్ణం మగవారి కానీ ఆడవారికి కానీ లైంగిక ఉత్పత్తిలో ప్రేరేపణ బాగా జరుగుతుంది. అంటే కొంత వారు మానసికంగా లేనివారు ఈ విధంగా వాడిన వాళ్లకు తగిన మోతాదులో లైంగిక కణాలు ఉత్పత్తి అవుతాయి.
- మానసిక ప్రశాంతత లేని వారు కూడా ఈ యొక్క ములకాయ చెట్టు ఆకులని సాయంత్రం టైంలో మనం టీ తాగుతున్న అలాంటి టీ లో కూడా కాగా పెట్టుకొని లేదా సపరేట్గా డికాషన్ చేసుకొని తాగిన వాళ్లకు మానసిక వత్తతిడి గ్గుతుంది. మనసు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. టెన్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. మెదడు లో చాలా చురుగ్గా ఆలోచన జరుగుతుంది
- ఈ ములకాయ ఆకులు, చెట్టు, పువ్వు, బెరడు, కాండం ప్రతిదాంట్లో విటమిన్స్ ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియల్ వైరస్ వల్ల వచ్చే టైఫాయిడ్ కానీ టీబి కానీ, కలరా కానీ, అతిసార వ్యాధి కాని, మంకీ ఫాక్స్ ఇలాంటివి ఏమున్నా ఈ జూసు తాగడం వల్ల రాకుండా నిర్మించవచ్చు. వచ్చిన వారు తాగడం వల్ల కొంత వరకు తగ్గించవచ్చు.
Advice – సలహాలు
<strong>Munagaku Benefits In Telugu</strong>
ఈ ములకాయ ఆకులని జ్యూస్ కానీ చూర్డిణం గాని డికాషన్ గాని ఏ విధంగా తాగిన ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. సమస్య ఉండదు. బీపీ ఉన్నవారు టాబ్లెట్స్ వాడుతూనే ఈ యొక్క కషాయం తాగవచ్చు. షుగర్ ఉన్నవారు కూడా టాబ్లెట్స్ వాడుతూనే ఈ యొక్క కషాయాన్ని డికాషన్ తాగవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. ఈ ములక్కాయ ఆకుల జ్యూస్ గానీ, చూర్ణం గానీ తగిన మోతాదులో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మంచి జరుగుతుంది అని చెప్పి రెగ్యులర్గా రోజువారీగా ఎక్కువ రోజులు తీసుకోకూడదు.
ఎక్కువ బీపీ లెవెల్స్ షుగర్ ఉన్నవారు నాడి పట్టడం ద్వారా మాత్రమే ఈ యొక్క ఆకు రసాన్ని ఇస్తాం కొంతవరకు ఉన్నవారు మాత్రమే ఈ యొక్క సలహాన్ని పాటించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆకుల వల్ల కానీ చెట్టు వల్ల కానీ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేదు. కానీ కొంతవరకు వాడడం మంచిదని మా సలహా…
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం CLICK HERE
FAQ
<strong>Munagaku Benefits In Telugu</strong>