Masculinity – మగతనం
Masculinity – మగతనం మన భారతీయ సాంప్రదాయ ఆయుర్వేదం ఎంతో గొప్పది. ఎన్నో రకాల మొక్కలు ఎన్నో రకాల ఔషధాలు గా ఉపయోగపడుతున్నాయి. వీటినుంచి మనిషి చనిపోయే స్థితి నుంచి కూడా బయటపడుతున్నాడు. అలాంటి వాటిలో ఈ మొక్క కూడా ఒక అద్భుత గుణాలు కలిగి ఉంది. దీనిని చిన్న”పల్లేరు కాయ చెట్టు” (Water Chestnuts) అంటారు. ఇది గ్రామాలలో పొలం పక్కలలో ఉంటుంది. దీనికి చిన్న చిన్న కాయలు రెండు ముళ్ళు వేసి ఉంటాయి. దీని ఆకులు నేల ఉసిరి ఆకుల వలె చిన్నగా ఉంటాయి. తిగజాతి మొక్కలా భూమిపై పాకుతూ ఉంటుంది. చూడడానికి దీని ముళ్ళు అసహ్యం కనిపించిన వీటిలో చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయి. అసలు ఈ మొక్క ఉపయోగాలు ఏంటి ఇప్పుడు మనం చర్చిద్దాం…
Masculinity – మగతనం
<strong>Masculinity</strong>
సాధారణంగా ఈ చెట్లు రెండు రకాలు చిన్నపల్లేరు , పెద్దపల్లేరు దీనిని ఏనుగు పల్లేరు అని కూడా అంటారు. దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పెద్దపలేరులో కూడా చాలా గొప్ప గుణాలు ఇమిడి ఉన్నాయి. అయితే సాధారణంగా మనకు దొరికేది చిన్న పల్లెలు చెట్టు ఎక్కువగా దొరుకుతుంది. ఈ చిన్న పల్లెలు చెట్టు వల్ల కిడ్నీలో రాళ్లు, చలువ చేయడం, ఊపిరితిత్తుల సమస్యలు, ఆడవారిలో రక్తహీనత, ఋతుచక్రంలో జరిగే మార్పులు ఇలా రకరకాల సమస్యలకు ఇది ఔషధం పనిచేస్తుంది. దీనిని గోక్షుర Gokshura చెట్టు అని కూడా అంటారు. అయితే ఈ చెట్టు ఉపయోగించే విధానం ఎలా పనిచేస్తుంది. ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు సుదీర్ఘంగా చర్చిద్దాం….
పేద్ద పల్లేరు (ఏనుగు పల్లేరు)
Uses – ఊపయొగలు
<strong>Masculinity</strong>
- ఈ చెట్టు సంవత్సరం పొడవు భూమిపైన పాకుతూ కనిపిస్తుంది. వీటి పువ్వులు పసుపు పచ్చ రంగులో ఉంటాయి. కాయలకు రెండు ముళ్ళు మాత్రమే ఉంటాయి. పెద్దపల్లేరుతో పోలిస్తే చిన్నగా చిన్న ముల్లు ఉంటాయి.
- చెట్టు యొక్క రసం సమూలంగా తీసుకొని కషాయం చేసుకొని ఉదయం సాయంత్రం తాగినట్లయితే కిడ్నీలో నిరాలని మెల్లమెల్లగా కరిగించేస్తుంది.
- మూత్రంలోని మంట, మూత్రం కొంచెం కొంచెంగా వచ్చినట్టుగా రాకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఈ పల్లేరు కాయను బాగా దంచి దాని నుంచి వచ్చిన రసంలో నాలుగు నుంచి ఐదు మిరియాలు కలిపి బాగా మరిగించి చల్లార్చుకుని త్రాగాలి.
- మూత్రం పోసేటప్పుడు మంటలేస్తూ రక్తం వస్తుంది. అలాంటివారు ఈ యొక్క చెట్టును సమూలంగా తీసుకొని మొత్తం దంచి ఆ రసం ను మజ్జిగలో వేసుకొని రోజు ఇలా పది రోజులు తాగినట్లయితే మూత్రం నుంచి వచ్చే రక్తాన్ని నిర్మూలిస్తుంది. మంటను కూడా ఆపేస్తుంది.
- వీర్యం పల్చబడడం వీర్యం రాకపోవడం ఇలాంటి సమస్య ఉన్నవారు ఈ యొక్క పల్లేరు కాయలను తీసుకుని 10 నుంచి 15 రోజులు నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణం రోజు ఒక చెంచా ఆవుపాలలో వేసి బాగా మరిగించి పట్టిక బెల్లం కొంచెం కలిపి లేదా పంచదార కలిపి రోజు తాగినట్లయితే వారికి ఈ వీర్య సమస్యలన్నీ తగ్గుతాయి.
- గుండె సమస్యలు ఉన్నవారు ఈ చెట్టు సమూలంగా చూర్ణం చేసుకోవాలి అంటే 10 నుంచి 15 రోజులు నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకొని ఆ చూర్ణాన్ని రెండు గ్లాసులల్లో ఒక చెంచా చూర్ణం వేసి బాగా మరిగించి సగం గ్లాస్ అయ్యే విధంగా మరిగించి అందులో కొంచెం పట్టిక బెల్లం వేసుకొని తాగినట్లయితే ఆయాసం, గుండెలో ఉండే కొవ్వు, నీరు వచ్చినట్లయితే ఆ నీరు కూడా తగ్గిస్తుంది.
- కామెర్ల వ్యాధి ఉన్నవారు ఈ చెట్టు సమూలంగా తీసుకొని పది నుంచి 15 రోజులు నీడలో ఎండబెట్టి ఆ చూర్ణాన్ని ఒక చెంచా చర్మని తీసుకుంటే దానికి కొంచెం దాల్చిన చెక్క చూర్ణం అలాగే పట్టిక బెల్లం కలిపి దానిలో నాలుగు నుంచి ఆరు మిరియాలు వేసి రోజు మూడు పూటలా సగం గ్లాసులో వేసుకొని తాగినట్లయితే కామెర్ల వ్యాధిని తగ్గిస్తుంది.
- అరికాళ్ళ మంటలు చాలామందికి వస్తుంటాయి. అలాంటివారు ఈ కాయలు బాగా దంచి రసం చేసి అరికాళ్ళకు వృద్దినట్లయితే ఈ అరికాల మంటలను తగ్గిస్తుంది. మళ్ళీ రాకుండా పూర్తిగా నిర్మూలిస్తుంది.
- నోట్లో దుర్వాసన వచ్చేవారు ఈ సమస్యకు ఈ కాయలను బాగా దంచి వచ్చిన రసాన్ని నోట్లో వేసి పుక్కిలించి కొద్దిసేపు ఉంచి బయటకు ఉంచేసినట్లయితే నోట్లో నుంచి దుర్వాసన ఆగిపోతుంది. ఇలా రెండు నుంచి మూడు రోజులు చేయాల్సి ఉంటుంది.
- ఈ చెట్టు యొక్క ఆకుల కాషాయం తాగడం వలన స్త్రీలలో రుతుచక్ర దోషాలు ఉన్నటువంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
- కంటి కలకలు వచ్చినవారు కళ్ళు ఎర్రపడతాయి. అలాంటి వారికి ఈ యొక్క చెట్టు ఆకులను తీసుకొని బాగా దంచి ఒక గుడ్డలో కట్టి రాత్రి పడుకునే సమయంలో ఆ గుడ్డ కనురెప్పలపై ఉంచే విధంగా చూసుకుని ఉన్నట్లయితే కంటి కలకలు తగ్గిపోతాయి.
- మూత్రశయంలో రాళ్లు పెద్ద సైజులో ఉన్న చిన్న సైజులో ఉన్న ఈ యొక్క కాయలను నీడల ఎండబెట్టి చూర్ణం చేసి ఆ చూర్ణాన్ని రోజు పాలలో వేసి బాగా మరిగించి చల్లార్చిన తర్వాత పట్టిక బెల్లం వేసి రోజు తాగినట్లయితే కొన్ని రోజులలో ఆ రాళ్లు కరిగి మూత్ర విసర్జన ద్వారా బయటకి పడిపోతాయి.
- బాగా తలనొప్పి ఉన్నవారు యొక్క చెట్టు కషాయాన్ని సగం చెంచా ఉదయం సాయంత్రం తాగినట్లయితే తలనొప్పిని పూర్తిగా నిర్మూలిస్తుంది.
- ఉబ్బసం ఆయాసంగా ఉన్నవారు ఈ యొక్క చెట్టు పువ్వులను తీసుకొని 10 నుంచి 15 రోజులు నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని రోజు ఉదయం సాయంత్రం పాలలో కానీ నిటిలో కానీ వేసుకుని తాగినట్లయితే ఉబ్బసం ఆయాసం నుంచి విముక్తి లభిస్తుంది.
- ఈ రోజుల్లో సమస్య ఏంటో లేనివారు అంటే ఎవరూ లేరు. కీళ్లనొప్పి నడుంనొప్పి వెన్ను బోక్కనొప్పి మోకాళ్ళ నొప్పులు అంటూ, వాపులు అంటూ చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి ఈ చెట్టు కాయల చూర్ణం ఒక గ్లాసు వాటర్ లో కొంత తగినంత మేరకు సొంటి వేసి బాగా మరిగించి ఆ గ్లాసు లోని కషాయాన్ని రెండు పూటలా తాగినట్లయితే ఈ మోకాళ్ల నొప్పులు కీళ్లవాపులు, నడుము, నొప్పులు తగ్గిపోతాయి.
- శృంగారంలో బాగా పాల్గొనాలి అనుకునేవారు ఈ చెట్టు కాయల చూర్ణం అలాగే అశ్వగంధ వేరు చూర్ణం పాలలో కలిపి బాగా మరిగించి చల్లార్చుకుని తాగాలి. ఇలా తాగినట్లయితే అంగ బలం పెరుగుతుంది. అంగానికి కావాల్సినంత రక్త సరఫరా జరిగి శృంగారంలో ఎక్కువసేపు పాల్గొంటారు. అలాగే శరీరం కూడా చలువ చేస్తుంది.
- ఆడవారిలో కుసుమ రోగాలు తెలుగుబట్ట, ఎరుపు బట్ట అనీ ఇలా ఉన్నటువంటి సమస్యలకు ఈ ఆకుల కషాయాన్ని రోజు ఉదయం ఒక చెంచాడు తాగినట్లయితే ఈ సమస్యలు తగ్గును.
- పాండు రోగమంటూ పూర్వ రోజు నుంచి చూసుంటారు. అలాంటి రోగాలకి ఈ యొక్క ఆకు కషాయాన్ని తాగిన కూడా మంచి ఫలితం ఇస్తుంది.
sperm development
- శృంగారం లో వెనుకబడిన వారు వారి అంగం గట్టి పడనీ వారు కూడా ఈ కాయల చూర్ణం పాలలో కలిపి పట్టికబెల్లంతో కలిపి వేడి చేసే చల్లార్చి 30 నుంచి 40 రోజులు రెగ్యులర్గా తాగినట్టయితే వారికి శృంగారంలో మంచి పట్టు లభిస్తుంది.
Advice – సలహాలు
<strong>Masculinity</strong>
ఇవన్నీ సమస్యలను నిర్మూలించడానికి మాత్రమే వాడాలి సమస్య లేకుంన రాకూడదు అని ముందు జాగ్రత్తగా చేయకూడదు. కానీ ఈ చూర్ణం వాడడం వలన అంగానికి బలం చేకూరుతుంది. శృంగారంలో పై చేయి మీదే ఉంటుంది. కిడ్నీలో రాళ్లు కరిగించడంలో మహా మేధస్సు కలిగినటువంటి చెట్టు ఇది. దీనిని సమూలంగా వాడిన ఆకులు బెరడు వాడిన మంచి ఫలితాన్ని ఇస్తుంది.
మీకు ఏమైనా సమస్యలు ఉన్నా మీకు చూర్ణం ఈ చెట్టు యొక్క ఔషధాలు దొరకాకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము మీకు వీటిని పోస్ట్ ద్వారా గాని కొరియర్ ద్వారా గాని అందిస్తాం. కానీ తగిన మోతాదులో వాడుకుని మంచి ఫలితాలను తీసుకుంటే మంచిది.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
FAQ
<strong>Masculinity</strong>
Palleru kaya english name meaning