Karivepaku Benefits – కరివేపాకు ఉపయోగాలు
Karivepaku Benefits – కరివేపాకు ఉపయోగాలు కొన్నిసార్లు ఈ సామెత వాడుతుంటాం ”నిన్ను కరివేపాకుల తీసి పారేశారు రా వాళ్లు’‘ అని సమయాన్నిబట్టి ఈ సామెత వాడుతుంటారు. కానీ ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఈ ప్రపంచంలో అయోగ్డైయున మనిషి లేడు ఔషధం కాని ద్రవ్యం లేదు అన్ని ఉపయోగకరమే. ఈ సామెతకు చక్కటి ఉదాహరణ కరివేపాకు కరివేపాకు ఉపయోగాలు ఈ కరివేపాకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. జుట్టు సమస్యను తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థకి మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ కంట్రోల్ లో ఉంచుతుంది. గుండె యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది. క్యాన్సర్ నిర్ములనికి సంబంధించినటువంటి లక్షణాలు దీంట్లో ఉన్నాయి. ఈ ఆకులేని కూరే లేదు. కచ్చితంగా ఆకు వేసే వరకు కూర కూడా చేయరు. కానీ దీన్ని మాత్రం ఈ కరివేపాకు తీసి బయట పారేస్తుంటారు. దీని యొక్క ఉపయోగాలు అనంతం అవేంటో కొన్ని మనం చర్చిద్దాం…
Karivepaku Benefits – కరివేపాకు ఉపయోగాలు
<strong>Karivepaku Benefits</strong>

దీని సంస్కృతంలో కైడరియా అని కృష్ణ నింబ అని పిలుస్తారు నింబ అంటే వేపాకు కృష్ణ అంటే నలుపు వేప ఆకులు పోలి ఉంటుంది. నల్లగా ఉంటుందని. అలాగే సురభి నింబా ఆని పేరు కూడా ఉంది. సురభి అంటే సుగంధపు వాసనని నింబ అంటే వేప చేతులు వాసన ఇస్తుందని కూడా అర్థం దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి ఏంటి ఇప్పుడు మనం చూద్దాం…..
Uses – ఉపయోగాలను
<strong>Karivepaku Benefits</strong>
- ఈ కరివేపాకు చెట్టుని సమూలంగా ఉపయోగించవచ్చు. చెట్టు యొక్క ఆకు, వేరు, కాండం లేదా ఆకులు కాయలు, పళ్ళు కూడా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. లేత ఆకుల కంటే ముదురు ఆకుల వల్ల ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. మనం రోజువారి ఉపయోగించే వంటలలో అయితే లేత ఆకులను మాత్రమే ఉపయోగిస్తాం. కానీ ఆయుర్వేదం ప్రకారం చెట్టు యొక్క ముదురు ఆకులు బాగా పనిచేస్తాయి.
- మన శరీరంపై అయినటువంటి పుండ్లు గాని దుర్వాసనతో కూడినటువంటి పుండ్లు గాని నోటిలో ఉన్న అల్సర్ నోట్లో నోట్లోని పుండ్లు గాని వీటికి ఈ చెట్టు యొక్క ముదురు ఆకులను తీసుకొని బాగా దంచి ఈ గాయాల పైన పెట్టినట్టయితే కొన్ని రోజుల తర్వాత గాయాలు తగ్గిపోతాయి. నోటిలోని పుండ్లకి ఈ చెట్టు ఆకులను కషాయంలో చేసుకుని గాని లేదా రోజు నోట్లో నమిలి కొద్దిసేపు పుక్కిలించి ఉంచిన నోట్లోని పుండ్లు తగ్గిపోతాయి.

- శరీరంలో నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మరి చాలా ఇబ్బంది పెడుతుంది. అలాంటి వాటికి ఈ చెట్టు ఆకులను బాగా దంచి రసం తీసి దానిలో కొంచెం నిమ్మకాయ రసం చక్కెర కలిపి రోజు ఒక స్పూన్ ఉదయం సాయంత్రం నీటిలోగానే డైరెక్ట్‌గా గానీ తాగినట్టయితే ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.
- స్థూలకాయత్వం ఉన్నవారు ఈ యొక్క ఆకులను బాగా దంచి ముద్దగా చేసి నీడలో ఎండబెట్టుకోవాలి దానిని రోజు ఒక చెంచా ఒక గ్లాసు మజ్జిగలో వేసుకొని తాగినట్లయితే వారికి స్థూలకాయత్వని నిర్మూలిస్తుంది.
- అధిక రక్తపోటు ఉన్నవారు ఈ చెట్టు పండ్లు లేదా బెరడును తీసుకొని రోజు కషాయం చేసుకొని అంటే నీటిలో వేసి బాగా మరిగించి చల్లార్చి వరకు ఆగి తాగినట్లయితే అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
- కాలిన గాయాలకు ఈ చెట్టు ఆకులను బాగా దంచి అందులో నెయ్యి గాని వెన్న గాని కలిపి కాలిన గాయాలపై రుద్దినట్లయితే ఆ గాయాలు ఇట్టే తగ్గిపోతాయి అలాగే అక్కడ మచ్చ రాకుండా కాపాడుతుంది.

- ఎక్కువగా దురదతో ఇబ్బంది పడేవారు ఈ యొక్క ఆకులను బాగా దంచి దానిలో కొంత పసుపు కలిపి ఒక బట్టలో వేసి వడ పట్టుకోవాలి. (ఎండబెట్టిన తర్వాత) ఆ వచ్చిన చూర్ణాన్ని రోజు ఒక గ్లాసు వాటర్ లో వేసుకొని మరిగించి చల్లార్చుకుని తాగినట్లయితే ఈ దురద తగ్గిపోతుంది. ఇలా కనీసం 40 రోజుల పైన చేయాలి అలా అయితేనే ఈ దురదను పూర్తిగా తగ్గిస్తుంది.
- జీర్ణవ్యవస్థ సరిగ్గా లేని వారు జీర్ణం కాని వారు ఈ యొక్క ఆకులని తీసుకొని 10 నుంచి 15 రోజులు నీడలో ఎండబెట్టుకోవాలి. తర్వాతి దాని చూర్ణం చేసుకొని రోజు ఒక స్పూన్ చూర్ణం మరి ఒక స్పూన్ తేనె కలిపి రోజు పరిగడుపునే తినాలి. ఇలా చేసినట్లయితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది అజీర్ణ సమస్య తగ్గిపోతుంది. వాంతులు ఉన్నవారికి వాంతులు కూడా తగ్గిపోతాయి.
- మామూలుగా జ్వరాలు వచ్చినప్పుడు మనిషి ఆహారం తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమయంలో ఈ యొక్క ముదురు ఆకులు తీసుకొని కషాయం చేసుకొని తాగినట్లయితే వారికి ఆహారం తీసుకోవడానికి కొంత ఉపాసన లభిస్తుంది అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.
- నీళ్ల విరోచనాలు కలిగిన వారు కేవలం ఈ ముదురు ఆకుల్ని కొంచెం అమ్ములు కొన్ని తింటే చాలు విరోచనాలు ఇట్టే తగ్గిపోతాయి.
- కడుపులో మంట ఎద కలడం అటువంటి సమస్యలు ఉన్నవారు ఈ ముదురు ఆకుల చూర్ణం ఈ చూర్ణం మజ్జిగ లో కలిపి తాగినట్లయితే ఎద కలటం సమస్య కడపులోని మంట సమస్యలను తగ్గిస్తుంది.
- మామూలుగా ఏదైనా క్రిమి కీటకాలు కర్చి నప్పుడు దద్దుర్లు వస్తుంటాయి. అలాంటి వాటి పైన ఈ యొక్క రసం దాని కొంత నిమ్మరసం కలిపి రుద్దినట్లయితే ఈ యొక్క దద్దుర్లపై చాలా బాగా పనిచేస్తుంది.
- శ్వాస సంబంధించిన ఇబ్బందులు ఉన్నవారు. ఈ యొక్క ఆకులు మరియు ఉల్లిపాయ మరియు ఉప్పును కలిపి కూరలా వండుకొని తింటే వారికి శ్వాస సంబంధించినటువంటి సమస్యను తగ్గిస్తుంది. జలుబు ఉబ్బసం ఉన్నా కూడా ఇలా చేస్తే తగ్గిపోతుంది.
- మూత్రపిండాల సమస్యలకు ఈ చెట్టు యొక్క వేరును తీసుకొని ఆ వేరు పై ఉన్నటువంటి చర్మాన్ని వలచి కషాయం చేసుకొని తాగినట్లయితే మూత్రపిండా సమస్యలు తగ్గిపోతాయి.

- అర్షమొలలు బ్లీడింగ్ అవుతున్నవారు వారికి ఈ చెట్టు యొక్క లేత ఆకులను తీసుకొని బాగా దంచి దాని నుంచి వచ్చిన రసానికి తేనె కలుపుకొని తాగాలి. ఇలా ఉదయం సాయంత్రం తాగినట్టయితే వారికి సమస్య తగ్గిస్తుంది.
- అర్షములలో సమస్యలు ఎక్కువగా రక్తం కారుతూ ఆగుతూ ఉంటుంది. నొప్పి వచ్చే వారికి ఈ యొక్క లేత ఆకులను దంచి ఆ రసం మరియు మజ్జిగలో కలుపుకొని తాగినట్లయితే ఆర్షములలో నొప్పిని నివారిస్తుంది మలబద్ధక సమస్యలు కూడా తగ్గిస్తుంది. ఎక్కువగా మజ్జిగ తాగేవారికి అర్శమొలల సమస్య రాదు.
- చర్మంపై సమస్యలు తగ్గడానికి, ముఖ సౌందర్యం కలగాలనుకునేవారు ఈ యొక్క ఆకుల చూర్ణాన్ని అలాగే వేపాకుల చూర్ణాన్ని రెండు సమభాగంగా కలిపి రోజు ఒక్క చెంచా గ్లాసులో వేసుకొని మరిగించి చల్లార్చకా తాగితే ముఖ సౌందర్యం పెరుగుతుంది. చర్మ సమస్యలు తగ్గుతాయి.
- మామూలుగా కంటికింద నల్ల మచ్చలు వస్తుంటాయి. అలాంటివారు చాలా ఇబ్బంది పడుతుంటారు. వాటికి ఈ యొక్క ముదురాకుల రసం మరియు దానికి ఇంత పెరుగు కలిపి లేదా వెన్నను కలిపి ఆ మచ్చలపై రుద్దినట్లయితే ఆ కళ్ళ కింద మచ్చలు కొన్ని రోజుల తర్వాత తగ్గిపోతాయి. ఇలా కనీసం ఒక 10 నుంచి 15 రోజులు వృద్దాల్సి ఉంటుంది.
- పాదాలు పగిలె సమస్య వున్న వారికి ఈ యొక్క ఆకు రసం మరియు నిమ్మరసం మరియు మర్రిపాలన కలిపి ఆ పాదాల పగుళ్లకు రాత్రి పడుకునే సమయంలో పెట్టి సాక్సులు వేసుకొని పడుకున్నట్లయితే పొద్దున సమయంలో మళ్లీ ఎప్పటిలా గోరువెచ్చని నీటితో కడగాలి ఇలా చేస్తే కొన్ని రోజులలో పాదాల పగుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి.
- చుండ్రు సమస్య ఉన్నవారు ఈ యొక్క ఆకులని దంచి అందులో నిమ్మకాయ రసం కలిపి మెంతులు పెసర్లు కలిపి రోజు షాంపుల వాడాలి. ఇలా వాడితే కొన్ని రోజులలో ఈ సమస్య తగ్గిపోతుంది.
- వెంట్రుకల కురుల ఆరోగ్యం కోసం ఆకులను దంచి ముద్దగా చేసి కొబ్బరి నూనె లో వేసి బాగా మరిగించాలి. మరిగించి నూనె మిగలెలా ఉంచుకుని రోజు తలకు పెట్టుకున్నట్లైతే వెంట్రుకలు నల్లబడడం గట్టిపడటం జరుగుతుంది.
- చెమట వల్ల వచ్చే దుర్వాసన శరీర దుర్వాసన వాటికి ఈ చూర్ణాన్ని మజ్జిగలో కలిపి తీసుకోవాలి అలా తాగినట్లయితే దుర్వాసన కొన్ని రోజులు తగ్గిపోతుంది.
ఈ చెట్టు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. వీటిని ఉపయోగించుకునే విధానం సక్రమంగా ఉండాలి. అందుకే ఆయుర్వేదంలో ఈ చెట్టుకు గొప్ప ప్రాధాన్యత ఉంది.
ఈ మొక్క ఉపయోగాలు అందరికి తెలేసే విధంగా అందరు తెలుసుకునేల షేర్ చేయండి ఒక like ఇవండీ.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
<strong>Karivepaku Benefits</strong>