Guava Frui – జామ పండు ఉపయోగాలు
ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని చర్మ తేజస్సును కాపాడే పండ్లలలో ”జామకాయ” ”Guava Frui – జామ పండు ఉపయోగాలు” ఒకటి. ఈ పండు తినడానికి ఎంతో తీయగా ఉంటుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఇన్ఫెక్షన్స్ ని దూరం చేస్తుంది. ఇందులో విటమిన్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల ఇది మనల్ని ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది.
Guava Frui – జామ పండు ఉపయోగాలు
<strong>Guava Frui</strong>
Guava Frui – జామ పండు
చలికాలం వచ్చేసిందంటే చాలు చాలా సీజనల్ పండ్లు వస్తుంటాయి. అలాగే శరీరంలో ఇన్ఫెక్షన్స్ కూడా మొదలవుతుంటాయి. సీజనల్ రోగాలు కూడా వస్తుంటాయి. ఇలాంటి వాటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ ఒక్క జామకాయ రోజు తింటే చాలు… ఇందులో మన శరీరంలో ఉండేటువంటి సమస్యలను దూరం చేయగలరా పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల ఇవి మన శరీరం ఆరోగ్యవంతంగా చేస్తాయి. ఈ జామ పండుని పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంతో తింటారు. అలాగే అందరికీ సామాన్యులకు సైతం దీని ధర అందుబాటులో వుంటుంది. ఇంకా ఈ జామ పండుతో పిల్లలకు మురబ్బా,జేల్లి జామ్ ఇలాంటివి కూడా చేసి ఇవ్వవచ్చు.
కంటి చూపులో..
<strong>Guava Frui </strong>
జామ పండులో కంటిచూపులు మెరుగుపరిచే గుణాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపుని కాపాడుతుంది దీనిలో వుండే పోలిక్ యాసిడ్ వల్ల గర్భవతులకు చాలా మంచిగా పని చేస్తుంది.
జీర్ణ సమస్య..
ఈ పండును ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున తిన్నట్లయితే మలబద్ధకం సమస్య ఉన్నవారికి సాఫీగా ఫ్రీ అయిపోతుంది. అలాగే శరీరం కాంతివంతంగా జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. కడుపు శుది అవుతుంది.
రోగనిరోధక శక్తి..
రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లు ఈ జామకాయను రోజు తిన్నట్లయితే రోగనిరోశక్తి ఇట్టే పెరుగుతుంది. ఈ జామకాయలు విటమిన్ సి లైకోపిన్ యాంటీ యాక్సిడెంట్ ఉండడం వలన వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. ఇంకా ఇది ఉదర సమస్యలు ఉన్నవారికి మంచి ఔషధం లా కూడా పనిచేస్తుంది. పండు కంటే కాయ తినడం వలన ఎక్కువ ఫలితం ఉంటుంది.
రక్తపోటు..
రక్తపోటు ఉన్నవారు ఈ జామకాయను గాని పండ్లను గాని రోజు తినడం వలన రక్తపోటున అదుపులో ఉంచుతుంది. మన సిరలలో ధమనంలో ఉన్నటువంటి కొవ్వుని కరిగించడంలో బాగా పనిచేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.
మద్యపానం నివారించడంలో..
మద్యపానం ఆపివేయాలి ఆనుకున్నవారు ఎండిన జామకాయలను మరియు జామ ఆకులను తీసుకొని చూర్ణంల చేసి ఈ చూర్ణం మద్యపానం సేవించే సమయంలో ఈ యొక్క పొడినీ నాలుకకు అంటించుకోవాలి. అలా వారికి మద్యపానంపై మక్కువ తగ్గుతుంది. ఫలితంగా మద్యపానం ఆపేస్తారు.
ముఖ్యంగా చక్కెర వ్యాధి ఉన్నవారు ఈ యొక్క పండును తినకూడదు కానీ ఈ యొక్క కాయని తగిన మోతాదులో తీసుకోవచ్చు. పండు తియ్యగా ఉండటం వలన చక్కెర వ్యాధి ఉన్నవారు తిన్నట్లయితే కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి.
ఇంక ఆరోగ్య సమస్యలకు నివారణ తెలుసుకోవాలంటే ఇక్కడ CLICK చేయండి.
FAQ
<strong>Guava Frui</strong>
Jamakaya english name and family