Ganuga Oil – కానుగ చెట్టు
Ganuga Oil – కానుగ చెట్టు సహజంగా పట్టణాల్లో గాని గ్రామీణ ప్రాంతాల్లో గాని ఈ చెట్టు చాలా చూస్తుంటాం.. దీనిని నూనెగా చేసి కూడా ఈ మధ్య చాలా అమ్ముతున్నారు. ఈ చెట్టును ”కానుగ చెట్టు” అంటారు. ఈ నూనె నీ ”గానుగ నూనె” అంటారు. ఆయుర్వేదం ప్రకారం ఈ చెట్టులో ఉన్నటువంటి ఆకు, పువ్వు, కాండం లేదా చిగుర్లు అన్నీ కూడా ఉపయోగకరమైనవే.. దీని యొక్క కాయ అందులో ఉన్నటువంటి పప్పు కూడా చాలా ఉపయోగకరంగా పనిచేస్తాయి. అయితే ఈ చెట్టుని ఉపయోగించే విధానం చాలా మృదువుగా ఉంటుంది. చూడడానికి ఈ చెట్టు చాలా ఎత్తు పెరుగుతున్న దీని యొక్క ఆకులు కొంచెం వెడల్పుగా ఉండి దీని యొక్క కాయలు దంచినట్లు అయితే కేవలం అందులో ఒకే ఒక పప్పు గింజ మాత్రమే ఉంటుంది. తరచుగా మనం ఈ చెట్టును చూస్తుంటాం. దీని గురించి తెలుసుకుందాం.. అసలు ఎలా వాడాలి.. అనేది ఇప్పుడు మనం చర్చిద్దాం…
Ganuga Oil – కానుగ చెట్టు
<strong>Ganuga Oil</strong>
KANUGA CHETTU
ఈ మధ్య పట్టణాలలో గానుగ నూనె అని చాలా ప్లేస్ లలో అమ్ముతున్నారు. అయితే ఈ గానుగ నూనె చర్మ సమస్యలను అన్నింటిని తగ్గిస్తుంది. మొండి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఫుల్లు కానీ కురుపులు గాని తామర, గజ్జి,కుష్టు, చర్మ సౌందర్యం ఇలాంటి చాలా చర్మ సమస్యలను ఇది తగ్గించడంలో ఔషధం గని అని చెప్పుకోవచ్చు.
ఈ చెట్టు సమూలంగా కూడా అన్ని సమస్యలు తగ్గించడంలో ఔషధగని.. అయితే ఈ కానుగ చెట్టుని గానుగ చెట్టు అని కూడా అంటారు. నోటిలో దంతాలను బ్రెష్ లా వాడితే నోటిలోని పుండ్లను కూడా ఈ చెట్టు చాలా బాగా తగ్గిస్తుంది. అలాంటి ఎన్నో సమస్యలను తగ్గించడంలో ఈ చెట్టు ఒక అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంది. అవి ఎలా వాడాలి… ఎలా చేస్తే ఫలితం ఉంటుందని ఇప్పుడు మనం చర్చిద్దాం…
Uses – ఉపయోగాలు
<strong>Ganuga Oil</strong>
- ఈ రోజుల్లో దగ్గు చాలా సమస్యగా మారింది. చాలామందికి దగ్గు చీడ పీడల వదలకుండా అలాగే వస్తూ ఉంటుంది. అలాంటివారు ఈ యొక్క కానుగ గింజలని తీసుకొని వాటి దంచినట్లయితే లోపల పప్పు వస్తుంది. ఆ పప్పుని బాగా నూరి దానిలో కొంచెం తేనె కలుపుకొని రోజు ఉదయాన్నే నాకి నట్లయితే ఈ దగ్గునీ తగ్గిస్తుంది.
- చిన్నపిల్లల్లో కోరింత దగ్గు కూడా ఇలాగే ఇబ్బంది పెడుతుంది. అలాంటి వారు కూడా ఈ కానుగ గింజలను తీసుకొని అందులో ఉన్న పప్పుని బాగా దంచి ఒక గ్రామ్ దంచిన పేస్టు దానికి, సమానంగా తేనె తీసుకుని పిల్లలకు రోజు ఉదయాన్నే నాలుకపై అంటించినట్లయితే వారికి కోరింత దగ్గు తగ్గిపోతుంది.
- సహజంగా పట్టణాలలో గాని గ్రామాలలో గాని తేలులను మనం గమనిస్తూ ఉంటాం. ఇది కుట్టినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. అలాంటి తేలు కుట్టినప్పుడు కూడా ఈ చెట్టు ప్రథమ చికిత్సల పనిచేస్తుంది.ఈ యొక్క గింజలను దంచి దానికి సమానమైన పట్టిక బెల్లాన్ని తీసుకొని రెండు కలిపి తేలు కుట్టిన చోట పెట్టినట్లయితే ఆ మంట నుంచి విముక్తి లభిస్తుంది. తర్వాత మనం హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
- చాలామందికి తలలో పేన్లు కురుపులు జిడ్డుగా ఉండడం గమనిస్తుంటాం. అలాంటివారు ఈ కానుగ చెట్టు యొక్క కాయల నుంచి వచ్చే పప్పును తీసుకొని బాగా దంచి తలకు పేస్టులా రుద్దుకున్నట్లయితే ఈ సమస్య నుంచి తగ్గిస్తుంది. అలాగే ఈ గానుగ నూనె రుద్దిన పేన్లు కురుపులు నెత్తిలో ఉన్నటువంటి సమస్యలు తగ్గిస్తుంది.
- శరీరంలో దుర్వాసన చాలామందికి వస్తుంది.. అలాంటివారు ఈ పప్పు గింజలను బాగా దంచి దానికి సమానంగా కొంత చింతపండు కలిపి ఈ రెండిటిని శరీరంపై మొత్తం రుద్దుకున్న ఒక అర్ధగంట సేపు ఆగి స్నానం చేసినట్లయితే శరీరం వచ్చే దుర్వాసన మొత్తం మాయమైపోతుంది.
- దీర్ఘకాలికంగా శరీరంపై చిన్న చిన్న కురుపులు ఉంటాయి. అలాగే పుండ్లు అవి చీమ కారుతూ ఎంతో అసహ్యంగా ఉంటాయి. దుద్దూర్లు, గజ్జి తామర చర్మంపై అదోరకంగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటికి కూడా ఈ గానుగ చెట్టు బెరడు అలాగే సమానంగా వేప చెట్టు యొక్క బెరడు తీసుకొని వావిలా ఆకులు కలిపి దంచి ఒక పేస్టులా చేసుకుని వాటిన కురుపులు, పుండ్లు చిన్న చిన్న చిమ్ము పండ్లపై కొన్ని రోజులు రుదినట్లయితే అవి తగ్గిపోతాయి.
- చాలామంది చెప్పుకోలేని సమస్యలలో ఇదొకటి వారి పురుషాంగాలు వాపు రావటం, గుంజడం అవి రెండు సమానంగా లేకపోవడం ఇలాంటి సమస్య ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు ఈ యొక్క గింజలా పప్పుని దానికి సమానంగా ఆముదం పప్పుని గచ్చకాయ పప్పునీ తీసుకొని ముద్దగా నూరాలి. వాటిని పురుషాంగాలకు ఎక్కడైతే సమస్య ఉందో ఆ చోట రోజు పడుకునే సమయంలో రుద్దుకొని పడుకున్నట్లయితే వారికి తొందరగా ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
- చర్మ సమస్యలు సోరియాసిస్ ఇలాంటి గజ్జి కానీ దురద గాని దుద్దులు గాని సిబ్బం గానీ అంటే చర్మం పైన తెల్ల మచ్చలుగా ఏర్పడి శరీరం అంతా వస్తూ ఉంటుంది.అలాంటివి ఉంటే గానుగ నూనె సహజంగా చాలా చోట్ల దోరుగుతుంది. ఆ గానుగ నునే తీసుకొని అందులో కొంచెం ఒక నిమ్మకాయని పిండి వాటిని ఈ యొక్క సమస్యల పైన రుద్దాలి. ఈ సమస్యలు నివారించబడతాయి. అలాంటివి ఉంటే గానుగ నూనె సహజంగా చాలాచోట్ల దోరుగుతుంది. ఆ గానుగ నునే తీసుకొని అందులో కొంచెం ఒక నిమ్మకాయని పిండి వాటిని ఈ యొక్క సమస్యల పైన రుద్దాలి. ఈ సమస్యలు నివారించబడతాయి. మళ్లీ రాకుండా చేస్తుంది.
- ఈ రోజుల్లో అందరినీ వేధించే సమస్య కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వల్లు నొప్పులు, వాపులు ఇలాంటి వాటికి కూడా ఈ గానుగ చెట్టు ఆకులను తీసుకునీ స్నానం చేసే ముందు నీటిలో వేసి బాగా వేడి చేసుకుని స్నానం చేసినట్లయితే ఈ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాపులు కూడా తగ్గిపోతాయి నెత్తిలో ఉన్నటువంటి ఫుల్లు, పేన్లు కూడా తగ్గిపోతాయి.
- కుష్టు వ్యాధి సమస్య ఉన్నవారు ఈ కానుగ చెట్టు ఆకులని దానికి సమానంగా చిత్రమలం ఆకులను తీసుకొని కొంత ఉప్పు కలిపి దంచి పెరుగుతో కలిపి రోజు తాగినట్లయితే ఈ కుష్టు వ్యాధి సమస్య తగ్గించబడుతుంది. కానీ శరీరం అనుకూలతను బట్టి ఈ యొక్క కషాయం తాగల్సి ఉంటుంది.
- అతిమూత్ర వ్యాధి ఉన్నవారు ఈ యొక్క చెట్టు పువ్వులు బ గుత్తులుగా కనిపిస్తుంటాయి. ఆ పువ్వులను తీసుకొని 10 నుంచి 15 రోజులు నీడలో ఎండబెట్టి చూర్ణం లా చేసుకోవాలి. ఈ చూర్ణంని రోజు ఉదయాన్నే అర గ్లాసు నీళ్లలో ఒక చెంచేడు చూర్ణం వేసుకొని వేడి చేసి చల్లార్చి తాగాలి. ఇలా తాగినట్లయితే వారికి అతిమూత్ర వ్యాధి నుంచి విముక్తి లభిస్తుంది.
- అవయవాలు చచ్చుబడి ఉన్న ఎముకలు విరిగిపడి ఉన్న ఇలాంటి వారు కూడా ఈ యొక్క ఆకులను, ఆకుల పైన ఆముదం నూనె రాసి కొంచెం వేడి చేసి దంచి ఆ అవయవాలు పై రుద్దినట్లయితే అవి తొందరగా కోలుకుంటాయి.
- దగ్గు ఆయాసం ఉన్నవారు ఈ యొక్క చెట్టు వేరుకాండాన్ని నీడలో ఎండబెట్టి దానిని కాల్చిన తర్వాత వచ్చే బూడిదను దానిలో బూడిధ అలం కలిపి ఉదయం సాయంత్రం నీళ్లలో వేసుకుని తాగినట్లయితే వారికి అధిక దగ్గు ఆయాసం తగ్గిపోతుంది.
- కడుపులో నులిపురుగులు ఉంటాయి. అలాంటి వారికి కింది పక్క దురద వస్తుంది. అలాంటి వారు కూడా యొక్క ఆకుల చూర్ణాన్ని తీసుకొని లేదా వేరు చూర్ణాన్ని తీసుకొని లేదా కాండం చూడడానికి తీసుకొని దానిలో కొంత నల్లుప్పు కలుపుకొని రోజు ఉదయం సాయంత్రం తాగినట్లయితే కడుపులో పురుగులు మలం ద్వారా వెళ్ళిపోతాయి.
Piles – అర్శామోల్లలు
- అర్షమొలలు ఉన్నవారు ఈ యొక్క ఆకులను, ఆకులు లేతగా ఉండాలి. ఆకుల పైన ఆముదం పూసి కొంత వేడి చేసి వాటిని దంచి పిలకలు ఉన్నచోట ఆ పిలకలపై రోజులు రుద్దినట్లయితే ఆ పిలకల నుంచి ఉపశమను లభించి అర్షమొలలు తగ్గిపోతాయి.
- అర్షములు ఉన్నవారు ఈ యొక్క పప్పుని దంచి వాటిలో తగినంత పటిక బెల్లం కలిపి రోజు ఉదయం సాయంత్రం నీటితో కలిపి తీసుకున్నట్లయితే వారికి ఉపశమనం లభిస్తుంది.
- అర్షములు ఉన్నవారు ఈ చెట్టు యొక్క లేత చిగుళ్ళను తెంపి వాటిని రోజు మజ్జిగ లేసుకొని పొద్దున సాయంత్రం తాగినట్లయితే వారికి ఈ అర్సముల నుంచి ఉపశమనం లభిస్తుంది.
- సహజంగా దేవుళ్ళకు సైతం మజ్జిగ ఒక అమృతంలా భావిస్తారు. రోజు మజ్జిగ తీసుకున్నట్లయితే రోగాలు రావని కూడా అంటుంటారు. ఔషధాలలో మజ్జిగ అమృతంలా పిలుస్తారు.
Advice – సలహాలు
<strong>Ganuga Oil</strong>
పై విషయాలన్నీ చెప్పిన విధంగా ఔషధాలను వాడినట్లయితే ఏ సమస్య ఉండదు. అధికంగా కలపడం తొందరగా తగ్గాలని చెప్పి ఎక్కువగా తీసుకోవడం వలన సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఏదైనా నెమ్మదిగా తగ్గించడమే సక్రమమైన మార్గంగా భావించి సక్రమమైన మార్గంలో మీరు తీసుకున్నట్లయితే పై సమస్యలన్నీ నివారించవచ్చు. ఈ చెట్టు వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. కానీ అధిక మొత్తంలో తీసుకోవడం ఎవరికైనా ఇబ్బంది. ఈ విషయాన్ని గమనించగలరు..
మేము మా దగ్గర ఉన్నటువంటి రోగులకు వారికి తగిన మోతాదులో ఇస్తూ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి చర్మ సమస్యలు గానీ అర్షములు గాని ఫుల్లు గాని నోట్లో ఉన్నటువంటి సమస్యలు గానీ వారి కడుపులోకి చర్మంపై ఉన్న సమస్య గాని ఈ విధంగా చేసి వారికి ఈ సమస్య నుంచి నివారణ కల్పిస్తున్నాం మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ పద్ధతులు పాటించి చేసుకున్నట్లయితే మీకు కూడా ఈ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. కానుగ చెట్టు చాలా ఉపయోగకరమైనది. ఈ చెట్టు వేరు తీసుకునే ముందు ఎప్పుడైనా చెట్టుకు నీరు పోసి తీసుకోవాలని మాత్రం మీరు ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు…
మరిన్ని ఆయుర్వేద చికిత్సలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
FAQ
<strong>Ganuga Oil</strong>