Gaddi Chamanthi – గడ్డి చామంతి
Gaddi Chamanthi – గడ్డి చామంతి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి ఈ చిన్న మొక్క ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంది. ఈ మొక్క ”గడ్డి చామంతి” (Tridax procumbens) మొక్క ఇది ఉష్ణ మండల స్థితిలోనూ ఉప ఉష్ణ మండల స్థితిలోనూ ఎక్కడైనా పెరుగుతుంది. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. ఇది చిన్నప్పుడు అయితే పిల్లలు వారి యొక్క పలకలు నల్లగా మారడానికి తీసి రుద్దేవారు. అయితే పలక నల్లగా మారి రాసినటువంటి అక్షరాలు క్లియర్ గా కనిపించేవి దీన్ని కొన్ని ప్రదేశాలలో గాయాపాకు అంటారు. అంటే గాయాలు తగిలినప్పుడు ఈ ఆకుని నలిచి రుద్దేవారు ఇంకొన్ని ప్రదేశాల్లో దీనిని రావణాసుర చెట్టు అని కొన్ని ప్రదేశంలో పలకాకు అని కొన్ని ప్రదేశంలో వైశాల కర్ని మన తెలంగాణలో అయితే ఎక్కువగా దిని నల్లారం అని కూడా అంటారు. కొన్ని చోట్ల దీన్ని పుటపుటలా ఆకు అని కొన్ని చోట్ల దీన్ని బెల్లపు ఆకు అని కూడా పిలుస్తారు. ఇలా రకరకాల పేర్లతో పిలబడే ఈ చెట్టు నిజమైన ఔషధ గుణాలు ఎన్నో కలిగి ఉంది. దీని ఉపయోగించే విధానం చాలా మృదువుగా ఉంటుంది. దీనిని ఇంగ్లీషులో Tridax procumbens అంటారు. అయితే ఈ ఆకు ఒక్క ఉపయోగాలు ఏంటి అసలు ఎలా వాడాలి ఎలా చేసే ఫలితం ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం.
Gaddi Chamanthi – గడ్డి చామంతి
<strong>Gaddi Chamanthi</strong>
సాధారణంగా ఇది ఒక ప్రదేశం అంటూ ఒక చోట అంటూ ఎక్కడ నిలకడగా మోలిచే ముక్క కాదు. ఇది ప్రదేశంతో సంబంధం లేకుండా ఎక్కడబడితే అక్కడ మొలుస్తుంది. దీని యొక్క పువ్వులు కొంచెం తల భాగంలో ఉండి నలిచినట్లయితే చెప్పడానికి చామంతి పువ్వులా ఉంటాయి. ఇది ప్రాకుడు జాతికి చెందినది కాదు కానీ కింద మాత్రమే భూమి పైన మాత్రమే పెరుగుతుంది. ఎక్కువ ఎత్తు మాత్రం పెరగదు ఇది చాలా మంది చూసి ఉంటారు. కాని దీని ఔషధాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ చెట్టుని పూర్వం రోజు నుంచి కూడా మన పూర్వీకులతో సహా దీని ఉపయోగించేవారు. ఇది రకరకాల సమస్యలు తగ్గించడంలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. భారతీయ సంప్రదాయంలో వైద్యంలో విడిదిగా వాడుతున్నటువంటి ఈ మొక్క యొక్క ఉపయోగాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం…
Uses – ఉపయోగాలు
<strong>Gaddi Chamanthi</strong>
- ఈ చెట్టుని కొన్నిచోట్ల కూర వండుకొని తింటారు. ఇలా తిన్నట్లయితే రక్తంలో షుగర్ స్థాయి అదుపులో ఉంటుందని నమ్మకం.
- గాయాలు తగిలినటువంటి గాయాలకు ఈ చెట్టు ఆకులు నలిచి ఆ గాయంపై పెట్టినట్లయితే గాయం తొందరగా మానుతుందని ఆ గాయం బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.
- చర్మంపై అయినటువంటి గజ్జి, తామర, దుద్దులు ఇలాంటి సమస్యలకు కూడా ఈ గడ్డి చామంతి మొక్క యొక్క ఆకులు గానీ కాండం గాని తీసుకుని బాగా దంచి వాటిని శరీరంపై వృద్దినట్లయితే ఈ చర్మ సమస్యలను ఇట్టే తగ్గిస్తుంది. ఈ చెట్టు సమూలంగా కూడా చర్మ సమస్యలు తగ్గించడంలో ఉపయోగిస్తారు.
- ఇంట్లో ఉన్నటువంటి దోమలను తరిమి కొట్టడానికి ఈ చెట్టు బాగా పనిచేస్తుంది. ఈ చెట్టు యొక్క ఎండిన ఆకులను తీసుకొని వాటిని నిప్పులపై వేసి పొగ వేసినట్లయితే ఇంట్లో ఉన్న దోమలన్నీ ఎప్పటికప్పుడే పారిపోతాయి. వీటికి ఈ చెట్టు ఆకుల పొగ అస్సలు పడదు.
- పూర్వం రోజు నుంచి క్రిమి కీటకాలు కచ్చినప్పుడు లేదా పాము కరిచినప్పుడు మన పూర్వీకులు అయితే ఈ చెట్టు యొక్క ఆకులను దంచి దీనితో పాటు కానుగు చెట్టు ఆకును దంచి రెండు కలిపి ఖర్చును చోట పెట్టేవారు ఇలా చేసినట్లయితే విషయం వెనక్కి లాగి కరిచిన చోట మంట కలగాకుండా ఉంటుంది.
- ఈ చెట్టు ఆకులను కాలేయ సమస్యలలో కూడా ఉపయోగిస్తారు.
- నరాల బలహీనత ఉన్నవారు ఈ చెట్టు ఆకులను రోజుకు రెండు చొప్పున ఉదయం సాయంత్రం తిన్నట్లయితే వారికి నరాల బలహీనత తగ్గిపోతుంది. ఈ చెట్టు యొక్క కాడ ఎలా వంగుతుందో అదే విధంగా నరాలు కూడా ఆ విధంగా వంగుతాయని మన పూర్వీకుల నుంచి వస్తున్న పూర్తి నమ్మకం.
- జలుబు, దగ్గు, ఉబ్బసం ఆయాసం ఉన్నవారు ఈ చెట్టు యొక్క ఆకులని రోజు రెండు చొప్పున తిన్న వారికి తగ్గిపోతుంది.
తైలం…
- తెల్లగా ఉన్న జుట్టు నల్లబడటం అధికంగా జుట్టు రాలిపోతున్న వారు జుట్టు మళ్ళీ రావడంలో ఈ యొక్క చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీనితోపాటు గుంటగలగరాకు మరియు నువ్వుల నూనె తీసుకొని మూడింటిని సమానంగా తీసుకుని ఒక గిన్నెలో వేసి సన్నని మంట తో చాలాసేపు మరిగించి ఆ నూనెను తీసుకొని రోజు కుదుళ్లకు లోనికి పోయే విధంగా రాత్రి సమయంలో పెట్టుకొని పొద్దున సమయంలో స్నానం చేసినట్లయితే 10 నుంచి 15 రోజులలోనే వెంట్రుకలు అధికంగా రావడం గమనిస్తారు. అదేవిధంగా నల్లగా రావడం కూడా మీరు గమనిస్తారు.
- ఈ ఆకు దొరకని వారు దీని యొక్క చూర్ణం దొరుకుతుంది. ఆ చూర్ణాన్ని గుంటగలగ చూర్ణాన్ని సమభాగాలు తీసుకొని కొబ్బరి నూనె గాని నువ్వుల నూనెలో గాని వేసి బాగా మరిగించి తర్వాత వడబట్టి ఆ నూనెను కూడా జుట్టుకు అప్లై చేసినట్లయితే జుట్టు పెరగడం తెల్ల జుట్టు నల్లగా మారడం తెల్లగా వచ్చే జుట్టు కూడా నల్లగా రావడం జరుగుతుంది. ఇదే విధంగా ఆ నూనెను చర్మంపై కూడా వృద్దినట్టయితే చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
ఈ మొక్క అందరు వాడవచ్చు . ఎలాంటి ఇబంది ఉండదు. చూర్ణం కన్నా పచ్చి ఆకూ మాత్రమే భాగా పని చేస్తుంది.ఈ మొక యొక్క వేరు కూడా వాడుకోవచు.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
<strong>Gaddi Chamanthi</strong>
Tridax procumbens common name in telugu
Tridax procumbens botanical name
Tridax procumbens common name in english
Tridax procumbens common name and family