Anacyclus Pyrethrum – అక్కలకర్ర ఉపయోగాలు
Anacyclus Pyrethrum – అక్కలకర్ర ఉపయోగాలు ప్రకృతిలో లభించే సహజమైన మొక్కలలో ఇదొక మొక్క. ఈ మొక్కని ”అక్కల కర్ర” అంటారు ఈ చెట్టు సహజంగా దొరుకుతుంది. కానీ గుర్తించడం కష్టం. దీనిని మీరు తీసుకోవాలనుకుంటే ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. కానీ ఈ చెట్టు యొక్క కాండం, వేరు మాత్రమే ఉపయోగకరం. సమూలంగా పనికిరాదు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి రకరకాల ఔషధాలలో ఈ యొక్క వేరు కాండంను వాడడం జరుగుతుంది. ఈ అక్కలకరా మొక్క చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. అవేంటో మనం ఇప్పుడు చర్చిద్దాం….
Anacyclus Pyrethrum – అక్కలకర్ర ఉపయోగాలు
<strong>Anacyclus Pyrethrum</strong>
ఇలాంటి ఈ అక్కలకర మొక్కకు వృక్ష శాస్త్రంలో రగలకాల పేర్లతో పిలుస్తారు. అవిష్ట దేశి అని, ఎలా సైక్లాస్ పైరత్నమని, ఇంగ్లీషులో అయితే Anacyclus Pyrethrum ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. వేరు తింటే కొంచెం కారంగా అనిపిస్తుంది. వీటిని మనం దొరికించుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. గుర్తించడంలో చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. కాబట్టి ఆయుర్వేద మొక్కల సలహాదారుని చిట్కాతో దీన్ని ఈజీగా దొరికించుకోవచ్చు. మీకు దొరకని పక్షాన ఆయుర్వేద షాప్ లలో విక్రయించడం మంచిది. నాలుకపై వేసుకొని ఈ వేరు నవిలితే చిమ్మచిమ్మ అని నాలుక మంట వేస్తుంది. వీటి ఉపయోగాలు అన్నీ కావు. చాలా అద్భుత ఫలితాలు ఇస్తాయి. అవి ఒకసారి చర్చిద్దాం…
Uses – ఉపయోగాలు
<strong>Anacyclus Pyrethrum</strong>
- శరీరంలో వాత నొప్పులు వాతపితం నిద్రరాని వారు కూడా వీటిని ఉపయోగించవచ్చు. ఎక్కువగా ఇది వాత నొప్పులకు పక్షవాతానికి ముఖ పక్షవాతానికి, మలబద్ధకానికి, జీర్ణ వ్యవస్థ సంబంధించిన సమస్యలకు కీళ్ల నొప్పులకు, నడుము నొప్పులకు, వెన్నునొప్పులకి ఇలా శరీరంలో రకరకాల సమస్యలను నివారించడంలో అగ్రగానమీ.
- ఈ మొక్క యొక్క వేరు చూర్ణాన్ని త్రైడ్ అనే రసాయనంలో దోమలను తరిమి కొట్టడానికి ఉపయోగిస్తారు.
- ఒంటి కణత నొప్పి అంటే ఒకే సైడ్ తలనొప్పి రావడం రెండు సైడ్లు తలనొప్పి రావడం కొందరిలో బాగా సమస్య ఉంటుంది. అలాంటివారు ఈ యొక్క అక్కల కర్ర వేరుని తీసుకొని మామూలుగా మిక్సీలో కాకుండా రాయిపై బాగా నూరినట్లయితే అరిగి గంధంల వస్తుంది. ఆ గంధంని ఎక్కడైతే తలనొప్పి వస్తుందో ఆ సైడులో రుద్దుకునే రాత్రి సమయంలో పడుకున్నట్లయితే పొద్దున సమయంలో వారికి ఈ నొప్పి తగ్గిపోతుంది. మళ్లీ రాకుండా కూడా ఇది నివారిస్తుంది.
- నత్తి ఈ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. మాట్లాడే విధానంలో ఒక్కోసారి ఒక్కోరకంగా సమయం తీసుకుంటుంది. అలాంటి వారికి నత్తి పోగొట్టడానికి ఈ అక్కల కర్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ నత్తి ఉన్నవారు అక్కల కర్ర వేరుని తీసుకొని రాయిపై బాగా నూరి వచ్చిన గంధాన్ని నాలుకకు రుద్దినట్లయితే నాలుక యొక్క నత్తిపోతుంది. అలాగే రుచి పెరుగుతుంది.
- వాపులు, నొప్పులు కొందరికి కీళ్ల నొప్పులు వస్తుంటాయి. మనికట్టు దగ్గర వాపు వేళల్లో వాపులు జాయింట్స్ దగ్గర వాపులు వస్తుంటాయి. అలాంటి వారు కూడా ఈ అక్కలకర వేరుని తీసుకొని బాగా నూరి ఆ వచ్చిన గంధాన్ని ఎక్కడైతే వాపులు ఉంటాయో అక్కడ పెట్టి మర్దన చేయాలి. కొంచెం నీటితో అలా చేసిన వారికి వాపులు తగ్గిపోతాయి. కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
- పిప్పి పన్ను నొప్పి మరియు దంతనొప్పి ఉన్నవారు ఈ యొక్క చెట్టు కాడను బాగా దంచి చూర్ణం చేసుకోవాలి ఆ చూర్ణాన్ని నీటిలో వేసి కొద్దిసేపు మరిగించిన తర్వాత వడ పట్టుకోవాలి. ఇలా వచ్చిన కషాయాన్ని నోట్లో పుక్కిలించి ఉంచిన పనునొప్పి తగ్గును. లేదా ఆ చూర్ణాన్ని బట్టతో వడగట్టుకుంటే సన్నటి చూర్ణం వస్తుంది. అలాంటి చూర్ణాన్ని పిప్పి పన్ను ఉన్నచోట పెట్టిన పనునొప్పి తగ్గిపోవును.
- నత్తి లేకున్నా కొందరికి మాటతడబాటు మాటలో క్లారిటీ ఉండదు. అలాంటి వారు కూడా ఈ అక్కలకర వేరు గంధాన్ని తీసుకొని నాలుకకురుద్దిన మాట స్పష్టంగా పలుకును
- ముఖపక్షపాతం కొందరికి చల్లగాలికి వెళ్లే సమయాలలో వారికి ముఖం నోరు కొంచెం పక్కకు జరిగినట్టుగా నొప్పి వేస్తూ ఉంటుంది. దీనిని ముఖపక్షవాతం అంటారు. అలాంటివారు ఈ అక్కలకర వేరు చూర్ణాన్ని లేదా గంధాన్ని తీసుకొని ఆ దవడకి బాగా రుద్దినట్లయితే ముఖపక్షవాతం తగ్గిపోతుంది.
- కీళ్ల నొప్పులు నడుము నొప్పులు శరీరక నొప్పులు ఇలా రకరకాలుగా ఉన్నాయి. వాటిలో సయటిక ఈ నొప్పి కడుపు వెనుక భాగంలో మొదలై మెల్లగా వెనక నుంచి ముందుకు తొడ భాగంలోకి వస్తుంది. అలాంటి నొప్పికి కూడా ఈ యొక్క వేరు బాగా దంచి చూర్ణం చేసుకొని లేదా గంధం ను రుదినా ఆ సయాటికా నొప్పి కూడా తగ్గిపోతుంది.
- గొంతు సమస్య ఉన్నవారు నలుగురు గొంతు దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతుంది. ఈ యొక్క వేరు చూర్ణం చేసుకోవాలి ఈ చూర్ణానికి తగినంత తేనె కలుపుకొని ఉదయం సాయంత్రం వాడటం వలన గొంతు సమస్యలు తగ్గిపోతాయి. అదే విధంగా పక్షవాతంలో కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.
- దంత సమస్యలు కదిలే దంతాలు ఉన్నవారు చిగురు నుంచి రక్తం వచ్చేవారు చిగురు నొప్పి ఉన్నవారు ఈ చూర్ణం బాగా కాచి చల్లార్చుకుని నోట్లో వేసి పుక్కిలిచ్చి ఉంచిన ఈ కదిలే దంతాలు దంత సమస్యలు చిగుర్లనొప్పి అన్ని తగ్గిపోతాయి. ఇలా ఉదయం సాయంత్రం రోజుకు రెండు సార్లు చేస్తే కొన్ని రోజులలో ఇవి పూర్తిగా తగ్గిపోతాయి.
- జీర్ణవ్యవస్థలో చాలా రకాల సమస్యలు వస్తుంటాయి. ఈ జీర్ణ వ్యవస్థలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడే అవి పైకి వచ్చి రకరకాల సమస్యలు కనిపిస్తుంటాయి. చర్మ సమస్యలని, మలబద్ధక సమస్య కానీ ఇలా ఎన్నో రకాలు జీర్ణ వ్యస్ధకు లింక్ అయి ఉంటాయి. అలాంటి సమస్యలను కూడా ఇది పూర్తిగా తగ్గిస్తుంది. ఈ వేరును కానీ కాండం కానీ నోట్లో వేసుకొని కొంచెం కొరికి ఆ రసాన్ని మెల్లగా మింగుతూ ఉన్నట్లయితే జీర్ణవ్యవస్థ సాధారణంగా జరిగిపోతుంది. మలబద్ధక సమస్యను నివారిస్తుంది. ఆకలి బాగా వేయును
- కొందరికి లాలాజలం ఊరక నోట్లో ఎప్పుడూ ఎండిపోయినట్టుగా ఉంటుంది. అలాంటివారు ఈ యొక్క వేరును నమిలి కొంచెం కొంచెంగా తిన్నట్లయితే వారికి విపరీతమైన లాలాజలం ఊరటంతో పాటు జీర్ణ సమస్యలు తగ్గి నాలుక యొక్క రుచి పెరుగుతుంది. కానీ ఈ సమయంలో మనిషికి చెమటలు పడతాయి. ఎక్కువ ఉష్ణం ఉన్నవారు ఈ వేరును నమలాకపోవడం మంచిది.
- దీర్ఘకాలికంగా తలనొప్పితో ఇబ్బంది పడేవారు. చాలావరకు ఉన్నారు. అలాంటివారు అది ఏ రకమైన నొప్పి అయినా దానికి ఈ అక్కలకర వేరుని తీసుకొని చూర్ణం చేసుకోవాలి. అదే విధంగా తగినన్ని మిరియాలు తీసుకొని చూర్ణం చేసుకోవాలి. అదే విధంగా తగినంత సొంటి తీసుకొని చూర్ణం చేసుకోవాలి. ఈ మూడు సమానంగా కలిపి కొంచెం నీరును కలుపుకొని తలపై పట్టించినట్లయితే ఈ సం దీర్ఘ కాలికంగా ఉన్నటువంటి తలనొప్పి తగ్గిపోతుంది.
- మూర్చ వ్యాధి వచ్చేవారు ఏ సమయంలో వస్తుందో తెలియదు. అలాంటి వారు ఈ అక్కలకాల వేరు చూర్ణాన్ని దానికి తగినంత తేనెను తీసుకొని ఉదయం సాయంత్రం తిన్నట్లయితే మూర్ఛవాది పూర్తిగా తగ్గిపోతుంది. పిల్లలు అయితే తక్కువగా తినాలి. పెద్దవారు అయితే ఒక చెంచా వరకు తినవచ్చు.
- మూర్చ వ్యాధి వచ్చే సమయంలో ఆ సింటమ్స్ కనిపించిన వారికి ఈ అక్కలకర వేరు యొక్క వాసనను ముక్కు దగ్గర పెట్టినట్టయితే ఆ మూర్ఛ వ్యాధి రాకుండా అప్పుడే తగ్గిస్తుంది.
- పక్షవాతం వచ్చినవారు వారికి లేవలేని పరిస్థితిలో ఉంటారు. ఈ పక్షవాతం మామూలుగా మెదడులో రక్తప్రసరణ తగ్గడం వలన వస్తుంది. అలాంటివారు చూర్ణం అదేవిధంగా సొంటి చూర్ణం అదేవిధంగా సన్న రాష్ట్రం చూర్ణం అదేవిధంగా నల్ల జీలకర్ర పొడి ఈ నాలుగు మిశ్రమాన్ని సమానంగా తీసుకుని రోజు ఒక గ్రాము తేనెతో కలుపుకుని తినాలి. ఇలా తినిన వారికి పక్షవాతంలో మంచి ఫలితాలు వస్తాయి.
- వాత జ్వరాలు కొంతమందికి నొప్పులతో కూడిన జ్వరలు వస్తాయి. వీటిని వాత జ్వరాలు అంటారు. అది ఏ రకమైన జ్వరం అయినా ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాంటి వాటికి ఈ యొక్క వేరు చూర్ణం సొంటి సన్న రాష్ట్రం మూడుచూర్నలు సమానంగా కలిపి ఒక గ్లాస్ వాటర్ లో మూడు వేసి బాగా వేడి చేయాలి. అలా చేసిన తర్వాత వాటిని వడ పట్టుకొని వచ్చిన కషాయం లో కొంచెం బెల్లం కానీ పటిక బెల్లం కానీ వేసుకుని తాగాలి. ఇలా తాగిన ఈ జ్వరాలు తగ్గిపోవును.
- కండరాల బలహీనత ఉన్నవారు వారికి ఈ చూర్ణం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కండరలా బలహీనత ఉన్నవారు ఈ చూర్ణం తీసుకొని ఈ చూర్ణంలో కొంచెం ఆవనూనె కలుపుకొని రుద్దినట్లయితే కండరాల బలహీనత తగ్గిపోతుంది. ఈ ఆవనునేతో మర్తను చేసే విధానం కేవలం వానాకాలంలో మాత్రమే చేయాలి.
- కండరాల బలహీనత ఉన్నవారు ఎండాకాలంలో అయితే ఈ చూర్ణాన్ని నువ్వుల నూనె మిశ్రమంతో తీసుకొని ఆ కండ్రాళ్లపై మర్తన చేసిన కండరాల బనహిత తగ్గిపోతుంది. ఉష్ణం ఎక్కువగా ఉన్నవారికి చేయకూడదు.
- మలబద్ధక సమస్య ఇది ఎంతో ఇబ్బంది కరం కడుపులో జామ్ అయిపోయినప్పుడు సర్వ రోగాలు వస్తూ ఉంటాయి. స్థూలకాయత్వం అధిక బరువు ఇవన్నీ ఒకే రకంగా వస్తూ ఉంటాయి. వీటికి ఈ అక్కలకర చూర్ణానికి తీసుకొని ఒకటి బై మూడు వంతు చేదుపుచ్చకాయ గింజల చూర్ణం తీసుకోవాలి. వీటిని బాగా దంచి వేడి చేసి చల్లార్చుకుని తాగిన ఈ మలబద్ధక సమస్య అధిక బరువు స్తులకయత్వం మూడిటిని తగ్గించును. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలను మల్లం ద్వారా బయటికి పంపించి కడుపు ఖాళీగా ఉంచేలా చేస్తుంది జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తద్వారా ఆకలి బాగా వేయును తిన్న వారికి అన్నం సరిగ్గా అరుగును.
పై విషయాలన్నీ ప్రాథమిక చికిత్సలో భాగంగానే చెప్పడం జరిగింది. మీరు ఏదైనా చేయాలనుకున్న ఆయుర్వేద వైద్యుల సహాయంతోనే చేయాలి. మీరు సొంతంగా చేసుకోవాలి అనుకున్న వారు కొంచెం కొంచెం గా తీసుకొని చేసుకున్నట్లయితే ఫలితాలను బట్టి వాడాల్సి ఉంటుంది.
శరీరంలో ఉష్ణం ఎక్కువగా ఉన్నవారు వేడితత్వంగా ఉంటారు. అలాంటి వారు కానీ కడుపులో పేగులలో ఉన్నట్టే అల్సర్లు ఉన్నవారు అలాంటివారు కానీ నోట్లోంచి రక్తం ముక్కులోంచి రక్తం వచ్చేవారు కానీ ఈ అక్కల కర్రతో వైద్యం చేసుకోకపోవడం మంచిది.. మీరు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఆయుర్వేద వైద్యుని సలహా మేరకు మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇది ఈ చెట్టు ఊష్ణవాహకం అంటే ఎక్కువగా శరీరానికి వేడి చేసే తత్వం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
<strong>Anacyclus Pyrethrum</strong>
Anacyclus pyrethrum in english
Anacyclus pyrethrum testosterone
Anacyclus pyrethrum common name