Pudina – పుదిన ఆకు ఉపయోగాలు
Pudina – పుదిన ఆకు ఉపయోగాలు పుదిన మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజు మనం కూరలలో వేసుకుని తింటుంటాం. కూరలలో దీని వేయడం వల్ల ఇంత టేస్టీగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. మరి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ పుదీనను తిన్నట్లయితే చాలా లాభాలు ఉన్నాయి. పుదిన భూమిపై తీగల పెరుగుతుంది. మంచి వాసన వస్తుంది.ఆ లాభాలేంటో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. …
Pudina – పుదిన ఆకు ఉపయోగాలు
Pudina
మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది మన జీర్ణ క్రియపై ఆధారపడి ఉంటుంది. మన కడుపులోని జీర్ణక్రియ సరిగ్గా పనిచేసినప్పుడు అన్ని ఆరోగ్యంగా ఉంటాయి. ఈ జీర్ణ క్రియా కొంచెం క్రమం తప్పిన చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. జీర్ణక్రియలో ఇలాంటి లోపం ఉన్న మలబద్ధకం, కడుపుబ్బరం, చర్మ సమస్యలు, నిద్ర సమస్యలు, అలసటగా ఉండడం, వికారంగా ఉండడం, ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ఏ సమస్య అయినా కడుపులో నుంచి మొదలై బయటకి మెల్లగా వస్తుంది కాబట్టి జీర్ణక్రియ వేగవంతం సరిగ్గా ఉన్నట్లయితే ఈ సమస్యలన్నీ ఒకే దగ్గర చెక్ వేయవచ్చు. కాబట్టి జీర్ణక్రియ వేగాన్ని ఎప్పుడు ఒకే విధంగా ఉంచుకునేలా చూసుకోవాలి.
జీర్ణవ్యవస్థ సరిగ్గా పని చేయాలంటే మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా మనం తీసుకునే ఆహారం తొందరగా అరిగే విధంగా ఉండాలి. ఎక్కువగా అరగని వస్తువులు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పై అధిక ఒత్తిడి జరుగుతుంది. దీనివల్ల మలబద్దక సమస్యలు వస్తాయి. కాబట్టి నూనె లేనటువంటి వస్తువులు తొందరగా అరగడానికి అవకాశాలున్నాయి. తక్కువ నూనె ఉన్న వస్తువులను ఎక్కువగా తినాలి. రోజు తినే ఆహారం ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి. ఒకరోజు ఒక రకంగా మరొక రోజు ఇంకో రకంగా తిన్నట్లయితే జీర్ణ వ్యవస్థలో కూడా రకరకాల మార్పులు వస్తుంటాయి. మనం తినే ఆహారంపై మన జీర్ణ వ్యవస్థ పనితీరు ఉంటుంది. ఈ జీర్ణ వ్యవస్థ మెరుగుపడితేనే అన్ని రకాల వ్యాధులను తగ్గించవచ్చు. ఎప్పుడైనా లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది. జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడంలో ఈ పుదీనా కీలకమైన పాత్ర పోషింస్తుంది. అవేంటో ఇప్పుడు మనం చర్చిద్దాం….
పుదిన ఒక రకమైన మంచి ఔషధం గల చెట్టు. ఇది తీగజాతికి చెందింది. అయినా దీని ఆకులు కొంచెం కారంగా కొంచెం అదొరకంగా ఉంటాయి. ఈ ఆకులను రోజు పరిగడుపున ఒక నాలుగు తిన్నట్లయితే మన జీవ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. కానీ ఈ పుదినన్ని మనం ఎక్కువగా కురల్లో వేసి వాడుతుంటాం. ఇలా వాడిన మంచి ఫలితాలు ఉంటాయి. మీ పుదీనా ఆకులను రోజు పరిగడుపున కషాయంలా చేసుకుని ఉదయం సాయంత్రం తాగినట్లయితే జీర్ణ వ్యవస్థలో ఉన్న సమస్యలు తొలగిపోయి మలబద్ధక సమస్య నివారిస్తుంది. చర్మ సమస్యలను కూడా ఇది ఈజీగా తగ్గిస్తుంది.
మీ అందరికీ తెలిసిన విషయం పుదీనా చల్లదనాన్ని ఇస్తుందని ఎండాకాలంలో అయితే పట్టణాల్లో ఎక్కడ చూసినా ఈ పుదీనా రసాన్ని అమ్ముతుంటారు. మజ్జిగలో కలిపి ఇలా తాగిన కొంతవరకు ఫలితాలు ఉన్నాయి. ఈ పుదీనా ఆకులను కొన్ని సందర్భాలలో గాయం తగిలిన చోట రుద్దిన మంచి ఫలితం ఉంటుంది. జలుబు చేసిన వారికి ఈ పుదినాకులను ఉదయం సాయంత్రం తినిపించినట్లయితే వారికి జలుబు నుంచి ఉపశమలు అందిస్తుంది. అలాగే ఈ పుదీనా ఆకుల వాసన పీల్చిన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎక్కువగా తిన్నప్పుడు అన్నం అరగడానికి ఈ పుదీనా నీ తినడం వల్ల ఈజీగా అరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీని కాడను దీని వేరును తీసుకొని 10 నుంచి 15 రోజులు ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసుకొని రోజు ఉదయం పరిగడుపున ఒక గ్లాసు నీళ్లు వేసుకొని తాగినట్లయితే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చేసినట్టయితే గ్యాస్ సమస్యలను, పేగులలో పేరుకుపోయిన మలం సమస్యలను పేగులు ఎండిపోయిన వాటిలో కొంత నీరు కదిలేలా చేసి పేగుల కదలిక పెంచి మలబద్ధకం ఈజీగా బయటికి వచ్చే విధంగా చేస్తుంది. ఈ పుదీనా ఆకులను రోజు తినడం వల్ల లాభాలు చాలా ఉన్నాయి. కానీ నష్టాలు లేవు. ఒకే రకంగా కాకపోయినా చూర్ణం తిన్న ఒకే రకమైన లాభాలు ఉంటాయి..
చాతి మంటలు
Pudina
ఏదైనా తిన్నప్పుడు కొన్ని సందర్భాలలో చాతిలో మంటలేసినట్టుగా కడుపులో మంట వస్తుంది. కొన్ని సందర్భాలలో ఫుడ్ చెడిపోయినది తీసుకున్న కడుపులో మంట రావడం జరుగుతుంది. ఇలా వచ్చినప్పుడు ఈ పుదీనా ఆకులను తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది. అదే విధంగా కషాయం చేసుకుని తాగిన తొందరగా ఫలితం ఉంటుంది. కొందరికి గ్యాస్ట్రిక్ సంబంధించి చాలా నొప్పి వస్తుంది. వారు ఈ ఆకులను తీసుకోవడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకుల చూర్ణం కూడా అదేవిధంగా పనిచేస్తుంది.
నోటి దుర్వాసన
Pudina
నోటిలోంచి వచ్చే దుర్వాసన కు ఈ పుదీనా చాలా బాగా పనిచేస్తుంది. నోట్లో పుండ్లు అయిన వారు చిగురులో మంట ఉన్నవారు చిగురు నుంచి రక్తం వచ్చే వారికి కూడా ఈ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. నోట్లోంచి వాసన రావడం నోటి పుండ్లు ఉండడం ఇలాంటివారు రోజు ఉదయాన్నే నాలుగు నుంచి ఐదు ఆకులు తీసుకుని బాగా నమిలి తిన్న లేదా పుక్కిలించి ఉంచిన మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఈ ఆకులతో పళ్ళు తోమినట్లయితే దంతాలు గట్టిపడతాయి. వాసన, చిగుర్ల నొప్పి తగ్గిపోతుంది.
చర్మ సౌందర్యం
Pudina
రోజు ఉదయాన ఈ పుదీనా ఆకులు తినడం వలన చర్మ సౌందర్యం పెరుగుతుంది. ముఖంపై అయినటువంటి మొటిమలు, కురుపులు తగ్గుతాయి. శరీరంలో ఎక్కడైనా మచ్చలు ఉంటే ఆ మచ్చలపై ఈ పుదీనా ఆకుల రసాన్ని రుద్దినట్లయితే మచ్చలు కూడా కొన్ని రోజులలో తగ్గిపోతాయి. చర్మం పొడిబారుతున్నవారు అలాంటివారికి ఈ ఆకుల రసాన్ని తాగినట్లయితే చర్మం మృదువుగా అవుతుంది.
చర్మం మృదువుగా అవటం ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి తగిన మోతాదులో చర్మ సమస్యలు ఉన్నవారు తక్కువగా తీసుకోవడం మంచిది.
సెగ కురుపులు
Pudina
శరీరంలో అధిక వేడి శాతం ఎక్కువైనప్పుడు సెగ కురుపులు వస్తుంటాయి. అలాంటివారు ఆ కురుపు లా పైన ఆకులను రుద్దిన తగ్గిపోతాయి. లేదా ఈ ఆకులను రోజు నాలుగు తిన్న తగ్గిపోతాయి. ఇంకా తొందరగా తగ్గాలి. అంటే ఈ పుదీన చెట్టు యొక్క వేరుని తీసుకుని రుదినట్లైతే తొందరగా తగి పోతాయి.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Pudina