Anjira – అంజిర పండు
Anjira – అంజిర పండు ప్రకృతిలో కెల్లా దొరికే చెట్లు చాలా ఉన్నాయి. అందులో ఈ చెట్టు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలది. ఈ చెట్టు పేరు చెబితే చాలు మనకు పద్యం గుర్తొస్తుంది. మేడిపండు చూడు మేలిమై ఉండు అని చెప్పే ఈ చెట్టు పేరు మేడి చెట్టు లేదా అంజీర చెట్టు అంటారు. దీన్ని సంస్కృతంలో మంజుల అంజిర అంటారు. దీనికి రకరకాల పేర్లు కలవు. ఈ చెట్టు ఊర్లలో అడవులలో చాలా పెద్దగా చిన్నగా ఉంటుంది. దీని కాడను గిచ్చినట్లయితే కొంచంగా పాలు వస్తుంది. దీని ఆకులు దీని కాడ ఇవన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. ఈ చెట్టు యొక్క చిగురుతో కూడా ఔషధలు చేస్తారు. ఇలా ఈ ప్రత్యేకత కలిగిన ఈ మేడి చెట్టు యొక్క అద్భుత ఫలితాలు ఈరోజు మీరు తెలుసుకోండి….
Anjira – అంజిర పండు
Anjira
Identification Method – గుర్తించే విధానం
Anjira
చిన్న నుంచి అతి భారీగా పెరుగుతుంది. అడవులలో ఎక్కువగా ఉంటుంది. మామూలుగా దీని యొక్క పండు గుండ్రంగా ఉండి దీని యొక్క ఆకులు నేరేడు ఆకుల వలె ఉంటాయి. ఈ చెట్టు చూసినట్లయితే తెల్లగా పూత పూయబడినట్లుగా కనిపిస్తుంది. ఈ చెట్టును గొడ్డలితో కానీ ఏదైనా ఇనూప వస్తువుతో కొట్టినట్లయితే కొంచెంగా పాలు వస్తాయి. దీని యొక్క చెట్టు కింద ఎక్కువగా పురుగులు కనిపిస్తాయి. ఈ చెట్టు మేడి చెట్టు అని చెప్పి గుర్తించవచ్చు. అతిబారి గా పెరగడంలో ఇది చాలా ఎక్కువ కనిపిస్తుంది….
Uses – ఉపయోగాలు
Anjira
- అప్పుడప్పుడే మొదలవుతున్న కుష్టు వ్యాధిగ్రస్తులు దీనిని శ్వేత కుష్టు అంటారు. అలాంటివారు ఈ యొక్క ఆకులను తీసుకొని బాగా దంచి వాటిపై రుద్దినట్లయితే ఈ వ్యాధిని తగ్గించడంలో చాలా దోహద పడుతుంది.
- నిద్రలేమీ సమస్య ఉన్నవారు ఈ యొక్క పండును తీసుకుని రోజు పడుకునే ముందు తిని ఒక గ్లాసు పాలు తాగి పడుకున్నట్టయితే వారికి నిద్ర బాగా వస్తుంది. పండు దొరకకపోయినా ఎండబెట్టిన పండు కూడా దొరుకుతుంది.
- శృంగారంలో అధిక ఇబ్బంది పడే వారు కూడా ఈ పండును రాత్రి పడుకునే సమయంలో రోజు తిన్నట్లయితే వారికి అమ్మోహమైన దేహపుష్టి లభిస్తుంది.
- అధిక బీపీ ఉన్నవారు ఈ పండును కానీ ఎండబెట్టిన కాయలు గాని తిన్నట్లయితే బీపీని తగ్గించే గుణం దీనిలో ఉంటుంది.
- గుండె సంబంధిత ఎన్నో రోగాలలో ఈ పండును వాడతాం ఈ పండు పచ్చిగా ఉన్న ఎండబెట్టి ఉన్న సమాన ఫలితాలని ఇస్తుంది.
- చిన్నపిల్లల లో బొక్కలు గట్టిపడడానికి వారి యొక్క జీవనశైలి అభివృద్ధి చెందడానికి ఈ పండు ను రోజు తినడం వల్ల వారికి ఎంతో లాభం చేకూరుతుంది.
- రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువ ఉన్నవారు ఈ పండును ఉదయం తిన్న తర్వాత సాయంత్రం తిన్న తర్వాత ఇలా 40 దినములు తిన్నట్లయితే వారికి రక్త శాతం పెరుగుతుంది.
- అర్షమొలలు ఉన్నవారు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ పండును తీసుకొని ఒక రోజు మొత్తం నీళ్లలో నానబెట్టి తిన్నట్లయితే వారికి ఎంతో ఉపశమనం లభిస్తుంది.
- మలబద్ధకం సమస్య ఉన్నవారు ఈ పండును రాత్రివేళ తిన్నట్లయితే నిద్ర రావడం అదేవిధంగా ఉదయం తటస్థంగా మలం బయటకు రావడం జరుగుతుంది.
- ఇలా ఈ పండుని ఉదయం సాయంత్రం తినడం వలన చెడు కొలెస్ట్రాల్ని కూడా ఇది దూరం చేస్తుంది. శరీరం కావాల్సిన పోషకాలను ఈ పండు అందిస్తుంది.
- ఈ పండును రోజు తినడం వల్ల కిడ్నీకి లివర్ కి గుండెకు బలం ఇచ్చును.
- చిన్నపిల్లల్లో పెద్దవాళ్లు దగ్గు ఉన్నవారు ఈ పండు గింజలను తీసి దానిలో దంచి కొంత చక్కెర కలుపుకొని తినిన దగ్గు నిమ్మలించును.
- కొందరికి పసికి గడ్డలు అవుతుంటాయి. అలాంటి వారికి ఆ గడ్డలపై ఆకులను కట్టిన ఆ గడ్డలు చీము బట్టి పగిలి తొందరగా తగ్గుతాయి.
- జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా ఈ పండును రెగ్యులర్ గా తినడం వల్ల సమస్యలు తగ్గిపోతాయి.
- పక్షవాతంతో బాధపడుతున్న వారు కూడా ఈ పండు తినడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది.
- పక్షవాతంలో ఈ చెట్టు కీలకమైన పాత్ర పోషిస్తుంది. కానీ దాని వాడే విధానం కఠినంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను దాని గురించి ప్రస్తావించడం లేదు.
- కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నా కూడా ఈ పండ్లు తినవచ్చు.
- శుద్ధ కట్టు పోయేవారు కూడా ఈ పండు తిన్నా లేక నీళ్లల్లో నానబెట్టుకుని రోజు తిన్న శుద్ధ కట్టు నివారించును.
- అధిక తామర గజ్జి ఉన్నవారు ఈ చెట్టు ఆకులను కాల్చి బూడిద చేసి ఆ బూడిదను నిలలో కలుపుకుని రుద్దుకున్న తగ్గిపోవును.
Advice – సూచనలు
Anjira
ఈ చెట్టు వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వీటిని వాడే విధానం సక్రమంగా ఉండాలి. లేని పక్షాన పని చేయవు. కాబట్టి ఏదైనా మీరు ప్రయత్నించాలి అనుకుంటే కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తూ మీకు సక్సెస్ వస్తున్నట్లయితే పూర్తిగా ప్రయత్నించండి. రానీ పక్షాన మమ్మల్ని సంప్రదించవచ్చు.
- ఈ పండ్లను అతిగా తినడం వల్ల కొందరికి కడుపు ఉబ్బసంగా ఇబ్బందిగా కలుగుతుంది. అలాంటివారు ఈ పండు తినకపోవడం మంచిది.
- ఈ పండ్లను క్రమంగా తినేవారు కొందరు అధిక బరువు లావు కావడం జరుగుతుంది. అలాంటివారు ఈ పండు తినకపోవడం మంచిది.
- ఈ పండు తినడం వలన చర్మానికి సునితత్వం పెరుగుతుంది. సౌందర్యవంతంగా అవుతుంది. కానీ చర్మం పల్చబడే అవకాశాలుంటాయి. అందుకని వారు ఎక్కువగా తినకపోవడం మంచిది.
- గజ్జి, తామర ఉన్నవారు దీనిని ఒకటి రెండుసార్లకు మించి వాడకూడదు. ఒకటి రెండుసార్లలో తగ్గిపోతుంది. తగ్గని పక్షాన వాడకపోవడం మంచిది.
- అయ్యే సమస్య అయినా మీకు అనిపించినట్లయితే మీరు ఈ చెట్టు ఈ పండు ఈ మూలిక మీకు పడట్లేదు అని అర్థం కనుక మీరు దీన్ని తీసుకోకపోవడం మంచిది.
మరిన్ని letest updats కోసం whatsapp లో joinఅవండి.
మరిన్ని letest updats కోసం Fcebook group లో join అవండి.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ
Anjira