Skin Allergy – చర్మ సమస్యలు
ఈ మొక్కలు వర్షాకాలంలో గుంపులు, గుంపులుగా కనిపిస్తుంటాయి. పల్లెటూర్లలో పొలాల పక్కన, రోడ్ల పక్కన ఇవి బాగా కనిపిస్తుంటాయి. ఏక కాల మొక్క అంటారు. అంటే ఒకే సంవత్సరం మొలిచి అదే సంవత్సరంలో అంతమైపోతుంది. మళ్లీ సంవత్సరానికి కొత్త మొక్క వస్తుంది. దీని పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. దీని యొక్క కాయలు బెబ్బరి కాయల మాదిరిగా విత్తులు ఉండి ఉంటాయి. ఈ మొక్కని ”తగ్గి రస” అని అంటారు. ఈ మొక్కలో చాలా అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి. కానీ ఈ మొక్క ఆకులు చూసినట్టయితే మేక కన్ను ఆకారంలో ఉండడం గమనించవచ్చు. ఈ మొక్కని ”రింగ్ ప్లాంట్” అని కూడా అంటారు. అంటే తామర తగ్గించే గుణం ఈ మొక్కలో చాలా ఉంటుంది. అది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం…..
Skin Allergy – చర్మ సమస్యలు
.<strong>Skin Allergy</strong>
ఈ మొక్క సలనేసి వంశానికి చెందినది. దీని శాస్త్రీయ నామంలో కేశీయ టోర అని పిలుస్తారు. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి.అవి చాకుండా ఆకు అని తంటేపు రొడ్డ మొక్క అని,కట్టపుర అని ఇంకా మన దగ్గర తగిరసా అని ఆయుర్వేదం ప్రకారం అయితే చక్రమార్థ అని అంటే ఇది ఎక్కువ శాతం తామరను తగ్గిస్తుంది అంటే గుండ్రంగా తామర ఉంటుంది కాబట్టి దీని చక్రవర్తి దదుర్లను తగ్గిస్తుంది కాబట్టి దద్రుఘ్న అని మేకలోషనా ఆని అంటే మేక కనుల ఆకు వుంటుంది కాబట్టి మేక లోషణ అంటారు. ఈ యొక్క మొక్క ఔషధ ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎలా వాడాలి? ఎలా వాడితే తగ్గుతుంది.. దీని యొక్క ఫలితం ఏంటి.. అనేది ఇప్పుడు సందేహం లేకుండా అన్ని చూసేద్దాం….
Uses – ఉపయోగాలు
<strong>Skin Allergy</strong>
- ఈ మొక్కని కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో అయితే కూరలా వండుకొని తింటారు. అక్కడ ఈ మొక్కకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇలా వాళ్ళు తిన్నట్లయితే వారికి మూల వ్యాధి ఇది చర్మ సమస్యలు తగ్గుతాయని నమ్మకం
- కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క మొక్క ఆకు రసాన్ని చేతులకు పూసుకుని ఏదైనా కీటకం ఉంటే పట్టుకుంటారు. ఆ యొక్క కీటకాలకు ఈ ఆకు వాసన పడదని అర్థం కొన్నిచోట్ల తేలులు జెర్రీలను కూడా పట్టుకుంటారు.
- తామర అనేది చాలా పెద్ద సమస్య అది గజ్జలలో మొదలై అక్కడ్నుంచి మనం ఎక్కడైతే దురద వున్న చోట గోకుతమో అక్కడ మళ్ళీ అది తామరలా తయారవుతుంది. ఎక్కువ దూరం ప్రయాణించే వాళ్ళు చెమట వల్ల ఒకరి నుంచి ఒకరికి ఇలా చేతివేళ్ల మధ్యలో వస్తూ ఉంటుంది. పుష్కర స్నానాల వల్ల అంటు వ్యాధుల ఇది చాలా మందికి పాకుతుంది. ఈ తామర తగ్గించడంలో ఇది రారాజులా పనిచేస్తుంది. ఈ తగిరస వేరుని తీసుకొని ఆ వేరుని దంచి దానిలో తగినంత నిమ్మరసం కలిపి ఆ తామరున్నచోట లేపనం చేస్తే తామర తగ్గిపోతుంది. లేదా ఈ మొక్క వేరుని ముల్లంగి చెట్టు యొక్క వేరుని రెండిటిని కలిపి దంచి తమరా వున్న చోట లేపనం చేస్తే అలా కూడా తామరని తగ్గిస్తుంది.
- కొంతమందికి చర్మం పొడి వాడడం కాంతివంతంగా లేకపోవడం గమనిస్తుంటాం. అలాంటివారు. ఈ యొక్క తగిరస గింజలను తీసుకొని వాటిని బాగా దంచి పెస్ట్ లా చేసుకుని చర్మంపై రుద్దినట్లయితే చర్మం పొడిబారడం తగ్గుతుంది. చర్మం కాంతి వంతంగా అవటం జరుగుతుంది.
- శరీరం పైన కొంతమందికి అనివార్య మచ్చలు ఏర్పడుతుంటాయి. దానిని పేరు లేని మచ్చలు అని అంటుంటారు. అలాంటి వాటికి కూడా ఈ యొక్క మొక్క గింజలను తీసుకొని అన్నం వండే గంజితో కలిపి బాగా దంచి పేస్టులా చేసుకోవాలి. అలా చేసుకున్న దానిని ఆ మచ్చల పైన పెట్టినట్లయితే ఆ మచ్చలు కూడా తగ్గిపోతాయి.
- తలనొప్పి పర్శపు నొప్పి అని అంటుంటారు. ఒకే సైడ్ రావడం జరుగుతుంది. అలాంటి ఈ తలనొప్పులకు కూడా ఈ గింజలను తీసుకొని గంజితో నూరి ఎక్కడైతే తల నొప్పి ఉంటుందో ఆ భాగంలో రుద్దినట్లయితే తలనొప్పి తగ్గిస్తుంది.
- ఇంకా కొన్ని రకాల చర్మ సమస్యలు ఉంటాయి. అలాంటివారు కూడా ఈ ఆకు రసం తీసుకుని రుద్దినట్లయితే చర్మ సమస్యలు తగ్గించవచ్చు.
- కందిరీగలు, జెర్రీలు,చిన్న చిన్న కీటకాలు ఏవైనా కర్చినప్పుడు ఈ యొక్క మొక్క ఆకు రసాన్ని పూసినట్లయితే నొప్పిని తగ్గించడం విషాన్ని హరించడం జరుగుతుంది.
- పుండ్లు చాలా రోజుల నుంచి పుండ్లు అలాగే ఉండి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అదొక రకమైన వాసన కూడా వస్తుంటుంది.అలాంటి పుండ్లకు కూడా ఈ యొక్క ఆకులని తీసుకొని ఆమోదపు నూనెలో కొంచెం వేడి చేసి చలార్చిన తర్వాత ఆ పుల్లపై ఆకు రసాన్ని ఆముదం నూనెతో కలిపి రుద్దినట్లయితే పుండ్లను తగ్గిస్తుంది.
- కీళ్లనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, ఉన్నవారు ఈ యొక్క ఆకు రసాన్ని మరియు గుంటగలగర అని ఇంకో చెట్టు ఉంటుంది. ఆ యొక్క ఆకు రసాన్ని కొంచెం తీసుకొని దానిలో రెండింటికి సరిపోయినంతగా రెండు పావులెత్తు నువ్వుల నూనె పోసుకుని బాగా చిన్న మంట పెట్టి వేడి చేయాలి. అలా చేసినట్లయితే కేవలం నువ్వుల నూనె మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఆ నువ్వుల నూనెని రెండు మూడు రోజులు ఎండలో ఉంచినట్టయితే ఏదైనా ఆవిరి ఉంటే వెళ్ళిపోయి కేవలం నూనె మిగులుతుంది. నూనెని రోజు ఆ నొప్పుల పైన రుద్దాలి ఇలా రుద్దినట్టయితే కొన్ని రోజులలో కీళ్లనొప్పులు నడుము నొప్పులు మోకాళ్ల నొప్పులు శరీర భాగంలో ఎక్కడైనా నొప్పులు ఉన్న తగ్గిపోతాయి.
- చర్మంపై దుద్దుర్లు గడ్డలు ఇలా కొంతమంది తెలియకుండానే వస్తుంటాయి. అలాంటి వాటికి కూడా ఈ యొక్క చెట్టు వేరును ఉత్తరేణి చెట్టు వేరును రెండు కలిపి సమంగా నూరి ఆ దుద్దుర్లు ఆ గడ్డలు ఉన్నచోట రోజు కట్టినట్లయితే అవి తగ్గిపోతాయి.
- అతిమూత్ర వ్యాధి అనేది ఈరోజుల్లో పెద్ద సమస్యగా ఉంది. చక్కెర వ్యాధి ఉన్న లేకున్నా అతిమూత్ర వ్యాధి చాలామందికి ఉంటుంది. రాత్రి పడుకున్న సమయంలో ఐదు నుంచి ఆరుసార్లు నిద్ర లేవాల్సి వస్తుంది. అలాంటి వారు కూడా ఈ యొక్క చెట్టు వేరుని తీసుకొని బియ్యం కడిగిన నీటిలో వేసి దంచుకుని రోజు ఉదయం పొద్దున్న సమయంలో తాగినట్లయితే అతిమూత్ర వ్యాధిని నివారించవచ్చు. ఇలా కనీసం మూడు నుంచి ఐదు రోజులు చేయాల్సి ఉంటుంది.
- కుష్టు వ్యాధి ఉన్నవారు ఈ యొక్క చెట్టును సమూలంగా తీసుకొని వేరుని ఆకులని కాండాన్ని విత్తనాలని తీసుకొని నీడలో పది నుంచి పదిహేను రోజులు ఎండబెట్టి చూర్ణం చేసుకోవాలి. ఇలా చేసుకున్న చూర్ణాన్ని రోజు ఒక గ్లాస్ వాటర్ లో వేసి వేడి చేసుకుని చల్లార్చుకుని తాగినట్లయితే ఈ కుష్టు వ్యాధి ఉన్నవారికి కూడా కుష్టును తగ్గించడం జరుగుతుంది. ఇలా రోజుకు మూడుసార్లు తాగాల్సి ఉంటుంది.
Advice – సలహాలు
Skin Allergy
సమస్య ఏదైనా వాటి తీవ్రతను బట్టి మన శరీరాన్ని బట్టి ఈ యొక్క చెట్టును ఉపయోగించాల్సి ఉంటుంది. మితిమీరిన వైద్యం సమస్యలు కలిగిస్తుంది. ఈ చెట్టులో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోయినా తగిన జాగ్రత్తలు తీసుకొని వాడాల్సి ఉంటుంది. ఏ రోగికైనా మేము ఎప్పుడూ కూడా ఆరోగ్య రీత్యా రోగి యొక్క నాడి, ఆయన యొక్క స్వభావం, రోగం తీవ్రత, సమస్యను బట్టి ఔషధం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఉపయోగించాలి అనుకుంటే మీయొక్క రోగం తీవ్రత యొక్క శరీరం యొక్క బలం మీ దగ్గర ఉన్నటువంటి ఇమ్యూనిటీని బట్టి ఈ మొక్కని వాడాల్సి ఉంటుంది. అధికంగా వాడితే ఎక్కువ బలం వస్తుంది అని చెప్పి వాడడం మంచిది కాదు… ఎంతవరకు అవసరమో అంతవరకే ఈ మొక్కను వినియోగించాల్సి ఉంటుంది.
ఇంకా మీకు తగ్గకుండా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు మేము మీ యొక్క నాడిని బట్టి మీ రోగ తీవ్రతను బట్టి ఎంతవరకు అవసరమైతుందో అంతవరకు మాత్రమే మందును ఇవ్వగలరు…
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
FAQ;
<strong>Skin Allergy</strong>
Skin allergy types with pictures
List of Ointment for skin allergy