Tulasi Plant – తులసి చెట్టు
Tulasi Plant – తులసి చెట్టు ఈ చెట్టుకి మన ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. పూర్వకాలం నుంచి పూర్వీకులు కూడా ఈ చెట్టుని ప్రతి ఇంటి గుమ్మ ముందు ఉంచేవారు. ప్రతిరోజు ఉదయాన్నే ఈ చెట్టు చుట్టూ తిరిగి రెండు ఆకుల నోట్లో వేసుకుని బయటికి వెళ్తే ఆరోగ్యం తో ఉండడం, అనుకున్న పనులు జరుగుతాయని ఒక నమ్మకం. ఈ చెట్టు పేరు ”తులసి చెట్టు”(Holy Basil) ఇందులో చాలా రకాల తులసి చెట్లు ఉన్నాయి. కృష్ణ తులసి అని, రామ తులసి అని, బూ తులసి అని, అడవి తులసి అని, ఇలా రకాలుగా ఉంటాయి. కానీ మనం సహజంగా చూసేది కృష్ణ తులసి దీనిని హరిజీవని కూడా అంటారు. ఈ తులసి చెట్టులో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు ఇంటి ముందు ఉన్నట్లయితే మన ఇంట్లోకి వచ్చే కార్బన్ డయాక్సైడ్ నెగటివ్ ని ఆకర్షించి పాజిటివ్ని మనకు ఇస్తుందని నమ్మకం. నిజానికి విషవాయువులు గాలి కాలుష్యాన్ని నియంత్రించడంలో ఈ చెట్టు యొక్క పాత్ర చాలా ఉంది. అందుకనే మన పూర్వీకులు ఈ చెట్టుని ఇంటి ముందు ఉంచేవారు ఈ చెట్టు నుంచి వచ్చే గాలి మనం పిలిచినట్లయితే ఆరోగ్యంగా ఉంటామని నమ్మకం. ఎప్పుడైనా బయటికి వెళ్ళిన వారి ఇంట్లోకి వచ్చిన ఈ చెట్టును చూస్తూ ఈ చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చుకున్నటైతే ఎన్ని టెన్షన్స్ ఉన్నా మానసికంగా వాళ్లకు ప్రశాంతత ఇంట్లోకి రాగానే లభించేది. ఈరోజుల్లో తులసి చెట్టు చూడడానికి కూడా కరువైపోయినాయ్ అలాంటి పరిస్థితో కూడా ఇలాంటి చెట్టు గురించి తెలుసుకుందాం.. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎలా వాడాలి? ఎలా వాడితే తగ్గుతుంది.. ఏమేం పని చేస్తుంది? ఇవన్నీ ఇప్పుడు మనం చూసేద్దాం…
Tulasi Plant – తులసి చెట్టు
<strong>Tulasi Plant</strong>
పూర్వకాలం నుంచైనా అన్ని చెట్లలో గల చెట్టు ఈ తులసి చెట్టు ఈ చెట్టును సర్వరోగ నివారణగా పిలుస్తారు. శరీరంలో ఉన్న చర్మ సమస్యలు, గ్యాస్ సమస్యలు, కడుపు ఉబ్బసం, దగ్గు, జ్వరం, అలాగే విష జ్వరాలు ఉన్నా కూడా, తలనొప్పి, మానసిక ప్రశాంతత, జీర్ణ సమస్యలు, గొంతు నొప్పి, ఇలాంటి మరెన్నో సమస్యలకు ఈ చెట్టుని, ఆకులని, బెరడుని, ఉపయోగిస్తారు. అవి ఎలాగో ఇప్పుడు చూసేద్దాం…..
ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఇంట్లోనూ ప్రతి గుళ్లోనూ ఈ చెట్టు కనిపిస్తుంది. అంటే ప్రతి గుళ్లో ఈ చెట్టు ఉండటంవల్ల గుడిలో వాతావరణం ప్రశాంతత కలిగిస్తుంది. అలాగే దేవుడి మెడలో కూడా తులసి మాల వేస్తుంటారు. ఈ తులసిమాల వల్ల దేవుడి దగ్గర ఉన్నటువంటి భక్తుల యొక్క చెడు స్వభావాన్ని హరిస్తుందని నమ్మకం, అందుకని విషవాయువులు మరియు విష వాసనలు కూడా తులసి హరించి మంచి ఆహ్లాదకరమైన గాలిని ప్రశాంతతను కలిగిస్తుందని, పూర్వం నుంచి వస్తున్న ప్రతిది. అందుకని ప్రతి గుళ్లోనూ ప్రతి ఇంటి ముందు చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కింద కాకుండా కనీసం నాలుగు ఫీట్ల ఎత్తులో ఉండే విధంగా చూసుకోవాలి. అందుకనే మన ఇంటి ముందు గానీ గుళ్ళలో గాని ఈ చెట్టుని దానికి ఒక దిమ్మగట్టి ఆ దిమ్మపై పెట్టేవారు. మనిషికి సరిపోను గాలి వచ్చే విధంగా… దీని యొక్క ఉపయోగాలు…..
Uses – ఉపయోగాలు
<strong>Tulasi Plant</strong>
- ఈ రోజుల్లో అయితే చాలామందికి లివర్ సమస్యలు వస్తున్నాయి. పట్టీ లివర్ అంటే లివర్ చుట్టూ కొవ్వు పేరుకొని నొప్పి రావడం ఇలాంటి లివర్ సమస్యలు ఉన్నవారు కూడా ఈ చెట్టు యొక్క ఆకులను తీసుకొని నీళ్లలో వేసి బాగా మరిగించి ఆ కషాయాన్ని తాగినట్లయితే లివర్ క్లీన్ అయిపోతుంది. లివర్ సమస్య ఉన్నవారు ఇలా చేసినట్లయితే కొంత వరకు ఉపశమనం లభిస్తుంది. లేనివారు తాగడం వల్ల వారికి లివర్ సమస్యలు గానీ మరీ ఇతర సమస్యలు రాకుండా కొంతవరకు కాపాడుతుంది.
- ఈ చెట్టు యొక్క ఆకులను రాత్రి సమయంలో లీలలు నానబెట్టి పొద్దున సమయంలో తీసుకొని టూత్ పేస్ట్ ల తోమినట్టయితే నోటిలో ఉన్నటువంటి పేర్కొన్న చెడు అంత తొలగిస్తుంది.
- ఎలాంటి విష వాయువులున్న వాటిని పీల్చిన తలనొప్పి వస్తుంది. అలాంటి సమయంలో కూడా ఈ యొక్క ఆకులని తీసుకొని మనం పీల్చినట్లయితే ఆ తల నొప్పి నుంచి కూడా ఈజీగా ఉపశమ లభిస్తుంది.
- హోమంలో కూడా తులసి మొక్కలను వేసి హోమం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో ఈ కట్టెలోక వాసన పిలిచినట్లయితే ఉబ్బసం ఉన్నవారికి చాలా మంచిది.
- గొంతు నొప్పి ఉన్నవారు ఈ తులసి ఒక్క ఆకులను తీసుకొని నీటిలో వేసి బాగా మరిగించి ఆ యొక్క కషాయాన్ని కొంత మిరియాలు వేసి తాగినట్లయితే గొంతు నొప్పి వెంబడే తగ్గిపోతుంది.
- జలుబు, దగ్గు ఉన్నవారు ఈ చెట్టు ఆకులను బాగా దంచి దానిలో కొంత తేనె కలిపి సేవించినట్లయితే జలుబు దగ్గు మెల్లమెల్లగా తగు మొఖం పడుతుంది. అలాగే చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది
- ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి శరీరంలో కొవ్వు పేరు పోవడం సహజంగా మారిపోయింది. ఎందుకంటే ఎక్కువగా కూర్చొని చేసే పనిలేక్కున్నాయి. చెమట తీసే పనులు లేవు. అలాంటి వారికి కొవ్వు పేరు కొనవల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ యొక్క తులసి ఆకులను రోజు 10 నుంచి 15 తీసుకొని మజ్జిగలో వేసుకొని తాగినట్లయితే వారికి కొవ్వు నుంచి కరిగించే ఉపశమనం లభిస్తుంది. కొవ్వు కరిగిపోయి మృదుగా మారిపోతారు.
- ఈ రోజుల్లో చిన్నవారు పెద్దవారు అనకుండా చాలామందికి నోటి దుర్వాసన రావడం మనం గమనిస్తున్నాం. అలాంటివారు ఈ యొక్క తులసి ఆకులని నీటిలో కానీ డైరెక్ట్ గా గాని వేసి మరిగించి లేదా నమిలి పుక్కిలించిన యొక్క దుర్వాసన నిర్మూలించవచ్చు. ఇలా రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం చేయాల్సి ఉంటుంది. ఈ ఆకులని అలాగే పళ్ళు తోమిన పాచితో పాటు ఈ యొక్క వాసన కూడా తొలగిపోతుంది.
- సహజంగా కొంతమందికి కళ్ళు దురద పెట్టినట్టుగా మంట వేసినట్టుగా అవుతుంది. అలాంటివారు ఈ యొక్క ఆకుల రసాన్ని కనురెప్పల పైన కొంత రుద్దినట్టయితే రాత్రి సమయంలో పొద్దున వారికి వారి కళ్ళు ప్రశాంతతగా ఉంటాయి.
- నిద్రలేమి సమస్య ఉన్నవారు చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఈ యొక్క ఆకుల కషాయాన్ని రాత్రి సమయంలో తాగినట్లయితే వారికి నిద్ర సరిగ్గా వస్తుంది. వాళ్ళు రోగ నిరోధక శక్తి కూడా చాలా పెరుగుతుంది.
- తక్కువ మోతాదులో జ్వరమున్న వారు కూడా ఈ యొక్క ఆకుల కషాయంలో కొంతవరకు మిరియాలని వేసుకుని రెండు రోజులు సేవించినట్లైతే ఉదయం, సాయంత్రం వారికి జ్వరం నుంచి విముక్తి లభిస్తుంది. చిన్న పిల్లలయితే పొద్దున సమయంలో తాపితే చాలు ఒకేరోజులో వారికి జ్వరం తగ్గిస్తుంది.
- యొక్క తులసి ఆకులని 10 నుంచి 20 తీసుకొని వాటిని పేస్ట్ లా చేసి అందులో కొంత పాలపొడి, నీళ్లు కలుపుకున్నట్లయితే అవి గట్టిగా ద్రవ రూపంలోకి మారుతుంది. అలాంటి వాటిని ముఖంపై రుద్దుకొని ఒక 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత చల్లనీటితో కడుక్కున్నట్టయితే చర్మం చాలా మృదువుగా తేజువంతంగా కనిపిస్తుంది.
- చాలామందికి ఆడవారిలో కానీ మగవారిలో కానీ పొడి చర్మం చర్మం జిడ్డుగా ఉండడం చూస్తుంటాం.. అలాంటివారు ఆ యొక్క ఆకుల రసంలో కొంత టమాట రసం చేసి ఒక చెంచాల తేనె కలుపుకొని ఆ ముఖంపై రుద్దునట్లయితే పొడి చర్మం నుంచి మరియు జిడ్డు చర్మం నుంచి మంచిగా మారుతుంది. అలాగే ముఖం కూడా తేజువంతంగా కనిపిస్తుంది.
- ఈరోజుల్లో యువ వయసులో చాలామందికి మొటిమలు ఆ మొటిమలు గిచ్చినప్పుడు నల్ల మచ్చలుగా ఏర్పడుతుంటాయి ఇవి ముఖంలో ఎంతో ఇబ్బందికరంగా మారుతుంటాయి. అలాంటి వాటికి ఈ యొక్క ఆకులను దంచి 10 నుంచి 12 ఆకులు తీసుకోవాలి. దానిలో మూడు నుంచి నాలుగు వేప ఆకులను తీసుకుని ఒక చెంచా మంచి గంధం పొడి తీసుకొని కలుపుకుని మచ్చల పైన మోటివేలపైన రాసినట్లయితే మొటిమలైన మచ్చలైన తగ్గుముఖం పడతాయి.
- గ్యాస్టిక్ సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. కొంత తింటేనే వారు కడుపు ఎంతో తిన్నట్టుగా నిండుగా అనిపించడం సమయానికి మోషన్ రాకపోయినా వచ్చినట్టు కనిపించడం ఇలాంటి వాటికి కూడా ఈ ఆకులను రోజు 10 నుంచి 12 వరకు ఒక్కో ఆకులూ తిన్నట్లయితే వారికి గ్యాస్టిక్ సమస్య తగ్గుతుంది. అలాగే రక్తం శుద్ధి కూడా అవుతుంది.
గ్యాస్ సమస్య
- మన ఆయుర్వేదంలో ఈ చెట్టు ఎన్నో ఉపయోగాలను ఇస్తుంది. అందులో చక్కెర వ్యాధి ఈ చక్కెర వ్యాధి ఉన్నవారు ఈ యొక్క ఆకులను రోజు తిన్నట్లయితే వాటి యొక్క చక్కెర శాతాన్ని నిదానం చేస్తుంది. తగిన మోతాదులు ఉంచుతుంది.
- జీర్ణ సమస్య ఉన్నవారు ఈ ఆకులను రోజు తిన్నట్లయితే వారి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే జీర్ణం కావడానికి సహాయపడుతుంది.
- మానసిక ఆలోచన మానసిక ఇబ్బందులు ఉన్నవారు ఎంతో ఇబ్బందికరంగా ఆలోచిస్తూ ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంటారు. అలాంటి వారు కూడా ఈ యొక్క ఆకులను తీసుకొని రోజు తిన్నట్లయితే వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. లేదా ఈ యొక్క ఆకు వాసన రోజు పిలిచిన వారికి ప్రశాంతత కలుగుతుంది.
ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న చెట్టుగా పేరుందిన ఈ తులసి చెట్టు ప్రయోజనాలు ప్రతి ఒక్కరూ చూసి నెమ్మదిగా వాడినట్లయితే మీరంతా యొక్క లాభాలను పొందవచ్చు. ఆకులు రోజు దొరకని వారు తులసి చెట్టు యొక్క చూర్ణం కూడా దొరుకుతుంది. లేదంటే ఆకులను తీసుకొని 10 నుంచి 12 రోజులు నీడలో భూమిపై ఎండబెట్టాలి. బండలపైన మరియు పెంకల పైన మరియు రేకుల పైన మరియు ఇనుప కడ్డీల పైన ఎండబెట్టకూడదు. భూమి పైన ఎండబెట్టి చూర్ణం చేసుకొని వాటిని మూడు నెలల వరకు వాడవచ్చు. ఈ చూర్ణం కూడా పై చెప్పిన అన్ని పనులకు పనిచేస్తుంది. కషాయం చూర్ణం వేసి కాసుకోవచ్చు. ఆకుల తినే తినాలనుకునేవారు నీటిలో వేసి కలుపుకొని తాగవచ్చు. ఇలా రకరకాలుగా ఉపయోగించవచ్చు.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం CLICK HERE
FAQ
<strong>Tulasi Plant</strong>
Tulsi scientific name and family