Mexican Prickly Poppy – చర్మ సమస్యలు
Mexican Prickly Poppy – చర్మ సమస్యలు మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల అద్భుత మొక్కలు ఉన్నాయి. అవి ఎన్నో రకాల జబ్బులని సమస్యలని ఎవరికీ ఏ మెడిసిన్ కి అందని సమస్యలను కూడా మన ఆయుర్వేదం ద్వారా తగ్గిస్తుంటాం. అలాంటి దానిలో ఇది ఒక మొక్క చూస్తే పిచ్చిదానిలా ఏంటో ఇది పనికిరాని దానిలా అసలు ఏంటిది అన్న విధంగా గజిబిజిగా ముళ్ళు వేసుకొని ఇక్కడో ఇసుక నెలలో చర్ల పక్కన ఒంటరిగా మొలుస్తూ ఉంటుంది. అలాంటి మొక్కే మహా అద్భుతమైన చర్మ సమస్యలను నివారించే ఈ చెట్టు గురించి ఈరోజు తెలుసుకుందాం….
Mexican Prickly Poppy – చర్మ సమస్యలు
<strong>Mexican Prickly Poppy</strong>
ఈ చెట్టు ఇసుక నెలలో చెర్ల పక్కన అక్కడక్కడ కనిపిస్తుంది. దీనిని మన సంస్క్రుత భాషలో ”స్వర్ణ క్షీరి” అంటారు. స్వర్ణం అంటే బంగారం. ఎందుకంటే దిని స్వర్ణక్షరి అంటారం. దీనిని ఆంగ్లం లో Mexican Prickly Poppy అంటారు. దిని కాండం చుంచి నట్టయితే దాని యొక్క రసం కాడ బంగారం కలలో కనిపిస్తుంది. అందుకని దీన్ని స్వర్ణక్షరి అంటారు దీని ఆకులు చూడడానికి భయంకరంగా ముళ్ళు ముళ్ళుగా ఎక్కడ పట్టుకున్న ముల్లుకు వచ్చే విధంగా, ఏదో గజ్జి తలిగిన చెట్టు లాగా, చూడడానికి అదోరకంగా కనిపిస్తుంది. ఇది పిచ్చిపిచ్చిగా ముళ్ళు ఉండడం వల్ల దీన్ని ”పిచ్చి కుసుమ” అని కూడా అంటారు. దీని యొక్క ఉపయోగాలు మహా అద్భుతంగా చర్మం యొక్క సమస్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎన్నో రోజుల నుంచి ఉన్న ఎలర్జీలు మానని పుండ్లు ఇలాంటివి తగ్గించడంలో ఇది మహా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చెట్టు పువ్వులతో సహా కాండం దీని యొక్క రసం ఇవన్నీ ఉపయోగమే. అయినప్పటికీ తగిన మోతాదులో తీసుకోకుంటే విషయంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి. దీని యొక్క ఆ రకంగా విషపూరిత చెట్టుగా కూడా చెప్పుకుంటారు. దిన్ని తగిన మోతాదులో సలహా మేరకు తీసుకొని వాడుకుంటే దీని యొక్క ఔషధం మహాద్భుతంగా పనిచేస్తుంది. అసలు ఎలా వాడాలి? ఎలా గుర్తించాలి? ఎలా వాడితే పనిచేస్తుంది ఏమేం పని చేస్తుంది? ఇప్పుడు మనం చూసేద్దాం…
Uses – ఉపయోగాలు;
<strong>Mexican Prickly Poppy</strong>
- ఈ చెట్టు యొక్క కాడను తెంపినట్లైతే దీని యొక్క రసం పసుపచ్చ కలర్లో కారుతుంది. ఈ యొక్క రసం ఒక్క చుక్కగానే కొంచెం వేలు కండించుకుని మనం కాటుక పెట్టుకున్న విధంగా కంటికి అంటిస్తే కంటికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా దురదగాని, సైట్ గాని, కళ్ళ వాపు గాని ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. ఇది తగిన మోతాదులో మాత్రమే కంటికి వాడాల్సి ఉంటుంది. ఎకువగా కళ్ళకు వేయకూడదు.
- ఈ చెట్టు నుంచి తీసినటువంటి టాబ్లెట్స్ కూడా క్యాన్సర్ లో వాడుతారు. మొదటి స్టేజిలో ఉన్నటువంటి క్యాన్సర్ తగ్గించడానికి ఈ చెట్టు యొక్క టాబ్లెట్స్ యూస్ చేస్తారు. రక్తం సంబంధించినటువంటి సమస్యలను కూడా ఈ చెట్టు తగ్గిస్తుంది. కానీ వాటిని తగిత మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.
- ఈ చెట్టు చర్మ సమస్యలకు మహా అద్భుతంగా పనిచేస్తుంది ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి గజ్జి, తామర, మచ్చలు చెప్పుకోరని చోటు ఉన్నటువంటి కురుపు లాంటి మచ్చలు ఇలా ఏమున్నా ఈ చెట్టు యొక్క రసాన్ని రుద్దినట్టయితే వెంబడి తగ్గిస్తుంది.
- ఈ చెట్టు యొక్క ఆకులని కచపిచా దంచి వాటిని నూనెలో వేసి బాగా మరిగించి బాగా మరిగించి వాటిని ఆయింట్మెంట్ల తయారు. చేసి కూడా చాలామంది చర్మ సమస్యలకు ఉపయోగిస్తుంటారు. దీని వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు చర్మ సమస్యలు ఎలాంటి ఉన్న మహా అద్భుతంగా తగ్గిస్తుంది.
- ఈ చెట్టు యొక్క పువ్వులు ఆ పూల యొక్క రెక్కలను తెంచి ముఖంపై ఉన్నటువంటి మచ్చలు ఇంకేమైనా చర్మ సమస్యలు ఉన్నట్లయితే వాటిని కొంచెం నూనెతో కలిపి ఆ సమస్యల పైన అప్లై చేస్తే అవి మహాద్భుతంగా తగ్గిస్తుంది. చర్మం కూడా మృదువుగా తయారవుతుంది.
- బాలింతలు బాలింతలకు కొందరికి వాపులు వస్తుంటాయి. ఇలాంటి వాపులకు కూడా ఏ చెట్టు యొక్క ఆకుని దంచి రసంని రుద్దినట్టయితే ఎలాంటి వాపులు ఉన్న వారికి వెంబడే తగ్గిపోతాయి.
- సాధారణంగా ఏదైనా కాలినప్పుడు కాలిన గాయానికి ఏదో ఒకటి పెడుతుంటాం కానీ అలా కాలిన గాయానికి ఈ యొక్క ఆకును దంచి ఆ కాలిన గాయం చోట పెట్టినట్టయితే ఆ గాయాన్ని తొందరగా మాన్పించడంలో ఈ చెట్టు ఎంతో తోడ్పడుతుంది.
- కామెర్ల ఉన్నవారు ఈ చెట్టు యొక్క ఆకులను తీసుకొచ్చి వాటిపై ఉన్న ముళ్లను తొలగించి ఆరి కాలుకి కాటుక పెట్టిన విధంగా రోజు అరికాలలో కింది భాగాన ఈ చెట్టు ఆకులని కాళ్లకు సరిగ్గా అనే విధంగా ఒక బట్టతో కట్టు కట్టాలి. ఇలా రోజు ఈ ఆకులను తీసుకొచ్చి ముళ్ళు తీసేసి కాలికి కట్టినట్టయితే మూడు రోజులలోకామెర్లు తగ్గిపోతుంది.
- చర్మ సమస్యలందు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. అలాంటి వాటిలో కుష్టు వ్యాధి చాలా ఇబ్బందికరమైంది. అలాంటి కుష్టి వ్యాధి కూడా ఈ చెట్టు యొక్క కాడను తెంపినట్లైతే పసుపు రంగులో వచ్చే రసాన్ని ఆ కుష్టు వ్యాధి సోకిన చోట చర్మంపై రుద్దినట్లయితే ఆ యొక్క చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా కొన్ని దినములు చేయవలెను.
- పుండ్లు తగిలిన గాయాలు ఎన్నో రోజుల నుంచి చీము పట్టి ఆ బాగా మొత్తం దురద వేస్తూ మెల్లమెల్లగా వేల్పవుతుంటుంది. అలాంటి గాయాలు కూడా ఈ చెట్టు యొక్క ఆకులను దంచి వాటిని ఆ గాయాల పైన కఠినట్లయితే ఎన్ని రోజులనుంచి ఉన్నవ్రానములు కూడా మానిపోతాయి. చర్మంపై ఉన్న మచ్చ కూడా కనిపించకుండా మునపటిలా మన చర్మం ఎలా ఉందో అలా తయారవుతుంది.
- ఈ చెట్టు యొక్క గింజలను తీసుకుని వచ్చి వాటిని దంచి చూర్ణముల చేసుకొని వాటిని మనం తైలంలా చేసుకోవాలని ఈ యొక్క తైలాన్ని చర్మ రోగములు తగ్గిపోతాయి. ఆ తైలాన్ని ఎప్పుడైనా తలనొప్పి ఎండకు పోయినప్పుడు సాధారణంగా వస్తుంది. అలాంటి వాటికి కూడా తైలం వృత్తినట్లయితే తలనొప్పి కూడా వెంబడే తగ్గి ఉపశమనం లబిస్తుంది.
- ఈ చెట్టు యొక్క ఆకులు గింజలు గాని కాడ గాని వేరుగాని మొత్తం తీసుకుని వచ్చి దంచి నువ్వుల నూనెలో వేసి నూనె మాత్రం మిగిలే విధంగా కాచిన తర్వాత అదొక తైలంలో తయారవుతుంది. ఆ తైలాన్ని మానని పుండ్లు చర్మ సమస్యలు దుద్దుర్లు, తామరలు, మచ్చలు ఇంకే విధమైనటువంటి సమస్యలున్న రోజు పెట్టడం ద్వారా ఆ సమస్యలు తగ్గిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఇలాంటి సమస్యలు రాకుండా పూర్తిగా నివారిస్తుంది.
ఈ యొక్క మొక్కని ఏ విధంగా వాడాలనే విషయాన్ని సమూలంగా తెలియజేశాము. కానీ ఈ యొక్క మొక్క నోట్లోకి గాని, కడుపులో గాని, తీసుకోవాలంటే పూర్తి సలహా లేనిది తీసుకోకూడదు. ఎందుకంటే ఇది కొంతవరకు విషపూరితమైనది. దాని విషస్వభావం అలాగే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించవలెను.
మా దగ్గర ఉన్నటువంటి రోగులకి మేము మా సలహా మీద వారికిస్తుంటాం. అంతేగాని మీరు సొంత నిర్ణయాలతో నోట్లోకి గాని, ముక్కులో గాని, చెవులో గాని దీని యొక్క చుక్కలు కషాయం గాని తాగకూడదు, కంటిలోకి మాత్రం దాని యొక్క రసాన్ని కాటుక పెట్టిన విధంగా కొంచెం అంటిస్తే చాలు కళ్ళు చల్లబడి దురద, ఎరుపబడిన, వాపువెక్కిన, మబ్బులు ఉన్న, నీళ్లు కారుతున్న ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. దీనిని శరీరంపై అప్లై చేయడమే కానీ కడుపులోకి నోట్లోకి, ముక్కులోకి, చెవిలోకి సలహా లేనిది తీసుకోకూడదు.
మరిన్ని ఆయుర్వేద చికిత్సల కోసం CLICK HERE
FAQ;
<strong>Mexican Prickly Poppy</strong>
Argemone mexicana medicinal uses
Argemone mexicana common name in India
Argemone mexicana plant description